పుష్కరాల్లో మృతిచెందిన వారి కుటుంబాలను బాబు పరామర్శించారా?

మంత్రి క‌న్న‌బాబు
 

అమ‌రావ‌తి: శవ రాజకీయాలు చేయడంలో టీడీపీ దిట్ట అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. శవ రాజకీయాలకు టీడీపీ పేటెంట్‌ అని ఎద్దేవా చేశారు. జంగారెడ్డిగూడెంలో పరామర్శకు రాజకీయ యాత్రలా వెళ్లారని దుయ్యబట్టారు. పుష్కరాల్లో మృతిచెందిన వారి కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారా? అని మంత్రి ప్రశ్నించారు. టీడీపీ ప్రతిరోజూ స్పీకర్‌ చైర్‌ను కించపరిచేలా ప్రవర్తిస్తోందన్నారు. చంద్రబాబుకు భవిష్యత్‌పై ఆశలు పోయాయి. చంద్రబాబును పచ్చ పత్రికలు, ఛానెళ్లు భూజానికెత్తుకుని మోస్తున్నాయని కన్నబాబు ధ్వజమెత్తారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top