రాత్రి బసతో ప్రజలలో ధైర్యం పెరిగింది

మంత్రి కన్నబాబు
 

విశాఖ: గ్యాస్‌ ప్రభావిత గ్రామాల్లో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో స్వయంగా మంత్రులే గ్రామాల్లో బస చేయడంతో ప్రజలలో ధైర్యం పెరిగిందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. వెంకటాపురంలో బాధితుల ఇంటిలో బస చేసిన ఇన్ ఛార్జి మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యలతో మూడు రోజుల తర్వాత  బాధిత గ్రామాల ప్రజలు ప్రశాంతంగా నిద్రపోయారని ఆయన తెలిపారు. ప్రతీ గ్రామంలోనూ వైద్య శిబిరాలు ఏర్పాటు కానున్నాయని  తెలిపారు. నేటి నుంచి వాలంటీర్ల సహకారంతో ఎన్యూమరేషన్ ప్రారంభం కానుందని పేర్కొన్నారు. పశువుల కోసం 25 టన్నుల పశుగ్రాసాన్ని పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top