అక్రమ నిర్మాణాన్ని తొలగించాల్సిందే..

చట్టాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది

అవినీతి,అక్రమాలను ఉపేక్షించేది లేదు..

వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు

అమరావతి:చట్టాలను కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత  ప్రభుత్వం అక్రమ కట్టడాలు నిర్మించిందని.. ప్రభుత్వమే అక్రమ కట్టడాలు నిర్మిస్తే.. ఏ అండలేని పేదలను ఏవిధంగా రక్షిస్తామని సీఎం జగన్‌ కలెక్టర్ల సమావేశంలో ప్రశ్నించారని గుర్తుచేశారు.అవినీతి అక్రమాలను ఉపేక్షించేది లేదని సీఎం స్పష్టంగా తెలిపారన్నారు.  ఒక సామాన్యుడు అక్రమ కట్టడం నిర్మిస్తే కచ్చితంగా కూల్చివేస్తామని..ప్రభుత్వానికి నిబంధనలు  అతిక్రమించే హక్కు ఎక్కడదని ప్రశ్నించారు. పారదర్శక పాలన అందించాలనే లక్ష్యంతో వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ప్రజావేదిక అక్రమ నిర్మాణం అని, దానిని తొలగించాల్సిందేనన్నారు. గత ఐదేళ్లల్లో రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి,అక్రమాలు జరగాయన్నారు. గత ప్రభుత్వంలో  సొంత పార్టీకి చెందిన వారికే ప్రభుత్వ పథకాలు ఇవ్వడమనేది అనవాయితీగా మార్చేశారన్నారు.దీనిని నియంత్రించాలని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారన్నారు.వైయస్‌ఆర్‌సీపీ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలందరూ నియామ నిబద్ధతతో నడుచుకుంటారన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top