నేను సచ్ఛీలుడినని సీబీఐ తేల్చింది..మీ సచ్ఛీలతను నిరూపించుకోండి బాబూ..!

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి 

భువనేశ్వరి యాత్ర చేస్తున్నట్లు నిజం గెలవాలంటే చంద్రబాబు నా సవాల్ ను స్వీకరించాలి

అబ్బాకొడుకులు రెండేళ్లుగా నాపై చేసిన ఆరోపణలకు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు..?*

చంద్రబాబు నిజంగా నీతిమంతుడైతే తనపై ఉన్న ఏ ఒక్క కేసులోనైనా సీబీఐ విచారణ కోరాలి.: మంత్రి 
కాకాణి గోవర్ధన్‌ రెడ్డి

బురదజల్లేద్దాం..అతనే కడుక్కుంటాడు అన్నట్లుగా ఆరోపణలు చేసిన చంద్రబాబు

మీరు చేసే ఆరోపణలన్నీ అసత్యాలు..అబద్ధాలని తేలిపోయింది.

చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొడుకుతుంది.

హుందాతనం కోల్పోయి, నీచానికి దిగజారి మాట్లాడిన బజారు వ్యక్తి చంద్రబాబు

మీలాంటి వాళ్ల నుంచి నేను క్షమాపణలు కోరుకోను. మీకు మీరే  క్షమాపణలు చెప్పుకోవాలి.

ఏ వ్యవస్థపైనైతే నమ్మకం లేదు అన్నావో..ఆ పోలీసుల విచారణే కరెక్ట్‌ అని సీబీఐ తేల్చింది

చంద్రబాబుకు అంత బలమే ఉంటే అందర్నీ కలుపుకుని ఎందుకొస్తాడు..?: మంత్రి కాకాణి గోవర్ధన్‌ 
రెడ్డి. 

 నెల్లూరు:  నేను సచ్ఛీలుడినని సీబీఐ తేల్చింది..మీ సచ్ఛీలతను నిరూపించుకోండి చంద్ర‌ బాబూ..! అంటూ  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి స‌వాల్ విసిరారు. ఆదివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

*నా పాత్ర లేదని నేను ఆనాడే చెప్పాను..సీబీఐ విచారణలో అదే రుజువైంది:*
– నెల్లూరు కోర్టులో జరిగిన దొంగతనంపై సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నా మీద పెట్టిన కేసులో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 
ఆనాడు పత్రాలు మాయం అయిన కేసులో ఎస్పీ విజయారావు విచారణ చేసి దోషులను గుర్తించారు. 
– ఆ తర్వాత నా మీద దాడి ప్రారంభం అయ్యింది..సాక్షాలు తారుమారు చేసి కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ మాట్లాడారు. 
– ఒకడుగు మందుకు వేసి దీన్ని గోవర్ధన్‌రెడ్డే చేశాడని ఆరోపిస్తూ సోమిరెడ్డి దానిపై ఎంత శిక్ష పడుతుందో కూడా చెప్పేశాడు. జడ్జిగారి కంటే ముందు ట్రైల్‌ స్పీడ్‌గా పూర్తి చేశాడు. 
– ఆనాడే మాకు సంబంధం లేదని స్పష్టం చేశాం. హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. 
– అందరితో పాటు నాకు కూడా నోటీసులు ఇచ్చింది. సీబీఐకి అప్పగించడానికి మీకేమైనా అభ్యంతరాలున్నాయా అని అడిగారు. 
– చాలా మంది నేను ప్రతిఘటిస్తానని అనుకున్నారు. కానీ నోటీసు ఇచ్చిన రోజే వెంటనే మా న్యాయవాది మేం సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పాం. 
– ప్రభుత్వం నుంచి అడ్వకేట్‌ జనరల్‌ గారు కూడా విచారణకు అభ్యంతరం లేదని చెప్పారు. 
– విచారణను ఈ దొంగతనం ఒక్కటే చేయాలా..మొత్తం కేసు మీద చేయాలా అని కూడా అడిగారు. 
– మొత్తం కేసు మీద విచారణ చేస్తామన్నా అభ్యంతరం లేదని తేలియజేశాం. 
– కోర్టులో ఫైళ్లు మాయమయిన వరకే కేసును పరిమితం చేస్తూ హైకోర్టు సీబీఐకి అప్పగించారు. 
– వాళ్లు నన్ను ఒక్క సారి విచారణ చేశారు..కానీ దోషి కంటే ఎక్కువగా సోమిరెడ్డి వారి చుట్టూ తిరిగాడు. 
– బయటకు రావడం..ఇక గోవర్ధన్‌ రెడ్డి తప్పించుకోలేడు అంటూ మీడియాతో చెప్పుకొచ్చాడు. 
– ఏడాది కాలం పాటు విచారణ సాగింది. అన్ని విషయాలు సేకరించారు..అందర్నీ విచారించారు. 
– వాళ్లు చేసిన విచారణ చూస్తే అన్ని కోణాల్లో విచారణ జరిపారు. మీడియాలో వచ్చిన వార్తల్లో వచ్చిన ఆరోపణలపై కూడా వారు విచారణ జరిపారు. 
– 88 మంది సాక్షుల స్టేట్‌మెంట్లను నమోదు చేశారు. అనాడు ఎస్పీ విజయారావు గారు గుర్తించిన నిందితులు ఇద్దరినే సీబీఐ కూడా దోషులుగా నిర్ధారించారు. 
– పోలీసుల విచారణలో కూడా ఎక్కడా లోపాలు జరగలేదని కూడా వారు స్పష్టంగా చెప్పారు. 
– నా పాత్ర లేదని నేను చెప్పుకునే కన్నా దేశంలో అత్యున్నత విచారణ సంస్థ సీబీఐ చెప్పింది. 
– చంద్రమోహన్‌ రెడ్డి కొన్ని ఆరోపణలు చేశాడు..వాటిని కూడా విచారణ చేశాం..నిందితులకు, గోవర్ధన్‌రెడ్డి అసలు సంబంధాలు లేవని చెప్పారు. 

*నీపై ఉన్న కేసుల్లో సీబీఐ విచారణ కోరగలవా చంద్రబాబూ..?:*
– సోమిరెడ్డిని నేను పెద్దగా పట్టించుకోను కానీ...పద్నాగేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాపై నిందలు వేస్తూ అనేక బహిరంగ సభల్లో మాట్లాడారు. 
– బురదజల్లేద్దాం..అతనే కడుక్కుంటాడు అన్నట్లుగా మాట్లాడిన చంద్రబాబు లాంటి వారి మాటలకు విలువ ఉందా? 
–నేను చంద్రబాబును అడుగుతున్నా...ఇక నువ్వు మాట్లాడే మాటల్లో విలువ ఉంటుందా? 
– నేను చాలా సార్లు చెప్పా..నేను సీబీఐ విచారణకు అంగీకరించా..నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ మీద ఉన్న కేసుల్లో సీబీఐ విచారణకు సిద్ధమా? 
– ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు నుంచి స్కిల్‌ కేసు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్, మద్యం కుంభకోణం వంటి వాటిలో నీ పాత్ర లేదంటూ వాటిపై సీబీఐ విచారణకు సిద్ధమా? 
– ఆయనకు ధైర్యం లేదు..కోర్టులకు వెళ్లి వాటిని అపుకున్నది అందరూ చూశారు. 
– నేను అవినీతి పరుడ్ని కాదు..నేను సీబీఐ విచారణకు సిద్ధపడ్డానని చంద్రబాబు చెప్పగలడా? 
– చంద్రబాబు మాట్లాడింది అబద్దం..వారి మీడియాలో వచ్చింది అబద్ధం..ఇవన్నీ అబద్ధాలు అయినప్పుడు నీ నోటి నుంచి వచ్చే ఏ మాటకైనా విలువ ఉంటుందా? 
– నీ కొడుకు వయసెంత..నా వయసెంత..? అతను ఎక్కడకు వెళ్లినా కోర్టు దొంగ కాకాణి అని మాట్లాడాడు. 
– అబ్బాకొడుకులు రెండేళ్లుగా నాపై మాట్లాడారే..ఈ రోజు నా పాత్ర లేదని తేలింది..మీరేం సమాధానం చెప్తారు? 
– మీకు మీరు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి. నేను మీలాంటి వాళ్ల వద్ద క్షమాపణలు కోరుకోను. 
– అనేక వేదికలపై..అనేక సభల్లో మీరు మాట్లాడిన మాటలకు ఈ రోజు ఏం సమాధానం చెప్తారు? 
– రాష్ట్ర పోలీసుల వ్యవస్థపై నమ్మకం లేదు..సీబీఐ విచారణ చేయాలి అని అడిగావు. 
– మీరు ఏ వ్యవస్థపైనైతే నమ్మకం లేదు అన్నావో..విచ్చలవిడిగా ఏ పోలీసులపైనైతే మీరు నోరు పారేసుకుంటున్నారో వాళ్లు దోషులుగా గుర్తించిన వారినే సీబీఐ కూడా దోషులుగా గుర్తించింది. 
– మీరు తప్పు పట్టిన పోలీసు వ్యవస్థ ఎక్కడా ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా పనిచేస్తుందనడానికి ఈ కేసు నిదర్శనం కాదా? 
– దీనికి సబంధించి సీపీఐ రామకృష్ణ గారు కూడా అవహేళనగా మాట్లాడారు. వాస్తవాలు తెలుసుకోలేదు. 
– మంత్రిపై దుమ్మెత్తిపోస్తే పతాక శీర్షికల్లో వార్తలు వస్తాయని వారు అనుకున్నారు? 
– మీరు చేసే ఆరోపణల్లో పసలేదు..అసత్యాలు..అబద్ధాలు అనేది ప్రజలకు అర్ధమైంది. 
– మీరు మా మీద, ప్రభుత్వం, పోలీసులు, వైఎస్సార్సీపీపై చేసిన ఆరోపణలను పక్కన పెట్టి మీ మీద వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమా? 
– నా మీద విచారణ పూరై్తంది..చార్జ్‌షీటు ఫైలయ్యింది..నా పాత్ర లేదని నిర్ధారణ అయ్యింది. 

*హుందాతనం కోల్పోయి, నీచానికి దిగజారి మాట్లాడిన బజారు వ్యక్తి చంద్రబాబు:*
– రేపు ఎన్నికల్లో మీరు గెలవాలనుకుంటే..ప్రజల విశ్వాసం చూరగొనాలి అనుకుంటే మీ మీద వచ్చిన అభియోగాల్లో ఒకదానిపైనైనా మీరు విచారణకు సిద్ధమా? 24 గంటల్లో స్పందిస్తే బాగుంటుంది. 
– కానీ చంద్రబాబు స్పందించడు..ఏ చాలెంజ్‌ విసిరినా ఊరకుక్కలు, వీధి కుక్కలతో మొరిగిస్తాడు. 
– బయటకు వచ్చినప్పుడు మాత్రం హుందాతనం కోల్పోయి నీచానికి దిగజారి బజారు వ్యక్తి కూడా మాట్లాడని స్థాయిలో మంత్రులపై కూడా మాట్లాడతాడు. 
– నువ్వు అవినీతి పరుడివి కాకపోతే..నీతిమంతుడివే అయితే..నీ పరిపాలన జగన్‌ గారి పరిపాలనకంటే బాగుంది అనుకుంటే ఎందుకు నువ్వు ఎందుకు అందరితో కలిసి పోటీ చేయాలనుకుంటున్నావ్‌..? 
– నువ్వు వీరుడివి..సూరుడివి అనుకుంటే..భువనేశ్వరి గారు కోరుకుంటున్నట్లు నిజమే గెలవాలి అనుకుంటే నా సవాల్‌ స్వీకరించు. 
– నువ్వు కోర్టుకు వెళ్లి నాపై సీబీఐ విచారణ జరపండి అని కోరితే నిజం గెలుస్తుంది. 
– అంత బలముంటే నువ్వు అందరినీ కలుపుకుంటూ మాట్లాడుకుంటున్నావు..? 
– నువ్వు అవినీతి పరుడివని, నీ నోటి నుంచి వచ్చినవన్నీ అబద్ధాలు అని తేలిపోయింది. 
– నీకు నువ్వు రాజశేఖరరెడ్డి గారికి సమకాలికుడిని అని చెప్పుకుంటున్నావు తప్ప తర్వాత జనరేషన్‌ నుంచి వచ్చిన జగన్‌ గారిని ఎదుర్కోలేక ఇంత మందితో పొత్తు పెట్టుకుంటున్నావు..
– అంత అనుభవం, వయసున్న వాడివి నీ అనుభవం అంత వయసు లేని జగన్‌తో పోటీ పడలేక అందర్నీ తెచ్చి పోరాడాల్సిన అవసరం ఏం వచ్చింది...? 
– నీ నోటి గుండా వచ్చేది అబద్ధాలు...నువ్వు నోరు తెరిస్తే అబద్ధాల కంపు కొడుకుతుంది. 
– నువ్వు నీతిమంతుడివే అయితే, అవినీతి పరుడివి కాకపోతే ఏ ఒక్క కేసులోనైనా సీబీఐ విచారణకు సిద్ధం కావాలి. 
– సోమవారం ఉదయం కోర్టు తెరవగానే నాపై సీబీఐ విచారణ చేయండి అని అఫడవిట్‌ ఫైల్‌ చేయాలి. 
– లేదంటూ నువ్వు అబద్ధాలకోరువి..అవినీతి పరుడవని రాష్ట్ర ప్రజలకు తేటతెల్లమవుతుంది. 
– జనసేన–టీడీపీ పొత్తుకు మేం భయపడటం లేదు..మాకు ఒంటరిగా వారందరినీ ఎదుర్కొనే ధైర్యం ఉందంటున్నాం. 
– వాళ్లకు అంత ధైర్యమే ఉంటే అందరూ కలిసి ఎందుకు ఎన్నికలకు వస్తున్నారు? 
– నేను పరువు నష్టం కేసు వేయడానికి వాళ్లలో ఎవరికి పరువు ఉంది..? 
– చంద్రబాబు, లోకేశ్, సోమిరెడ్డిలకు పరువు ఉందా? ఇటువంటి వారిపై పరువునష్టం వేస్తానంటే ఎవరైనా నవ్వుకుంటారు. 

Back to Top