వైయ‌స్‌ఆర్‌ పింఛన్‌ కానుక పేదలకు వరం 

మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి

నెల్లూరు:  వైయ‌స్ఆర్ పింఛన్‌ కానుక పేదలకు వరమని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తెలిపారు. పొదలకూరు మండ‌ల ప‌రిష‌త్ కార్యాలయంలో నూత‌నంగా మంజూరైన 448 పింఛ‌న్ల‌ను సోమ‌వారం మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముందుగా కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు, వారి కుటుంబాలకు అభినందనలు తెలిపారు. గతంలో పింఛన్లు పొందాలంటే జన్మభూమి కమిటీలు సిఫారసు చేయాల్సి ఉండేదని చెప్పారు. అలాగే సంవత్సరానికోసారి మాత్రమే ఇచ్చేవారని, ఎవరైనా పింఛనుదారులు చనిపోయినా వారి స్థానంలోనే కొత్తగా పింఛన్లు ఇచ్చేవారని తెలిపారు. నేడు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఎన్నడూ లేనివిధంగా సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి వాలంటీర్ల ద్వారా  పింఛన్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. 

Back to Top