తాడేపల్లి: వ్యవసాయ రంగంలో సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకువచ్చి పంటలు దెబ్బతిన్న రైతులకు సీజన్ ముగిసేలోపే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా నెరవేరుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదంతా కూడా రైతుల అభివృద్ది, రైతుల సంక్షేమం, రైతు శ్రేయస్సు కాంక్షించి సీఎంగారు తీసుకున్న నిర్ణయాల ఫలితమే అన్నారు. వరుసగా ఐదో ఏడాది మొదట విడతగా... కౌలు రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట సాగుదారు హక్కు పత్రాలు(సీసీఆర్సీలు) పొందిన వారిలో అర్హులైన 1,46,324 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలు రైతులు, దేవాదాయ భూముల సాగుదారులకు తొలివిడతగా వైయస్ఆర్ రైతు భరోసా సాయంగా రూ.109.01 కోట్లు, పంట నష్టపోయిన 11,373 మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా రూ.11.01 కోట్లతో కలిపి మొత్తం రూ.120.75 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం వైయస్ జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రులు, లబ్ధిదారులు మాట్లాడారు. వారు ఏమన్నారంటే...వారి మాటల్లోనే.. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అందరికీ నమస్కారం, వైయస్ఆర్ రైతు భరోసా–పీఎం కిసాన్ పథకం 2019 నుంచి ప్రారంభించి ఐదేళ్ళు సమర్ధవంతంగా సీఎంగారి ఆధ్వర్యంలో కొనసాగించడం జరిగింది. మాట ఇచ్చిన దానికన్నా మిన్నగా రూ. 50 వేల సాయాన్ని రూ. 67,500 చేయడం అందరికీ తెలిసిందే, ఈ ఘనత సీఎంగారిదే, అదే విధంగా కౌలు రైతులకు సంబంధించి కూడా క్రమం తప్పకుండా సాయం చేయడం, ఈరోజు సీఎంగారు రూ. 109.74 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఉద్యానవన పంటలకు సంబంధించి కూడా ఇన్పుట్ సబ్సిడీ కూడా రూ. 11.01 కోట్లు ఈ రోజు జమ చేయడం జరుగుతుంది. ఒక మంచి సాంప్రదాయాన్ని తీసుకువచ్చి పంటలు దెబ్బతిన్న రైతులకు సీజన్ ముగిసేలోపే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలనే మాట ప్రకారం ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా సీఎంగారు నెరవేరుస్తున్నారు. గత ప్రభుత్వ బకాయిలు కూడా చెల్లిస్తూ రైతులకు అవసరమైన అన్ని కార్యక్రమాలు సమర్ధవంతంగా, సంపూర్ణంగా సీఎంగారు అమలు చేస్తున్నారు, దాని వలన సగటున 14 నుంచి 15 లక్షల టన్నుల ధాన్యం అధికంగా ఉత్పత్తి చేసుకునే పరిస్ధితికి వచ్చాం, ఇదంతా కూడా రైతుల అభివృద్ది, రైతుల సంక్షేమం, రైతు శ్రేయస్సు కాంక్షించి సీఎంగారు తీసుకున్న నిర్ణయాల ఫలితమే. ఎప్పుడూ నవ్వతూ ఉండే సీఎంగారికి ప్రజలు, రైతులు కూడా నవ్వు మొహంతో ఉండాలని ఆకాంక్షించే సీఎంగారికి అందరితో పాటు రైతుల ఆశీస్సులు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సీదిరి అప్పలరాజు, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి అందరికీ నమస్కారం, నాడు ప్రతిపక్షంలో ఉండగా జగన్ గారు చేసిన వైయస్ఆర్ రైతు భరోసా ఆలోచన గొప్ప ఆలోచన, అదే ఆలోచనతో తెలంగాణ కూడా పథకాన్ని ప్రవేశపెట్టింది, అదే ఆలోచనతో ప్రధాని గారు కూడా పీఎం కిసాన్ దేశవ్యాప్తంగా పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. సీఎంగారి ఆలోచన రాబోయే రోజుల్లో ప్రతి రాష్ట్రం కూడా దీనిని అమలుచేసేలా మీరు ఒక గొప్ప మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క రైతు భరోసానే కాదు అనేక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు రాబోయే రోజుల్లో దేశ అభివృద్దిని ముందుకు తీసుకెళ్ళడంలో గొప్ప పాత్రను పోషిస్తాయి, ధన్యవాదాలు. రాధాకృష్ణ, రైతు, గురజాపులంక, బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా జగనన్నా నమస్తే, గతంలో భారీ వరదల వల్ల మా పంటలు దెబ్బతిన్నాయి, మీరు మా గ్రామంలో ప్రతి ఇంటకి తిరిగి, ప్రతి పంట పరిశీలించారు. ఆ రోజే మీరు మాట ఇచ్చారు, మీరు నష్టపోయిన పరిహారం వెంటనే ఇస్తామన్నారు, దాని ప్రకారం ఈ రోజు సాయం చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు అన్నా, ఈ సాయం మాకు రెండో పంట వేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆర్బీకేల ద్వారా మాకు అన్నీ అందుతున్నాయి, మాకు తక్కువ ధరకే ఎరువులు, విత్తనాలు అందుతున్నాయి, మేం యంత్రసేవా పథకం ద్వారా కూడా లబ్ధిపొందుతున్నాం, మా లంక గ్రామాలు పరిశీలించి మీరు సాయం చేయడం మరిచిపోలేం, మా గ్రామాల అందరి తరపునా మీకు ధన్యవాదాలు, మీ పథకాలు అన్నీ అందుతున్నాయి, మాకు ఈ నాలుగేళ్ళలో రూ. 5 లక్షల సాయం పొందాను, మా గ్రామల్లో రివిట్మెంట్ కట్టించి కోతకు గురికాకుండా చేస్తామన్నారు, అది కూడా పూర్తయితే మా లంక గ్రామాల ప్రజలు మిమ్మల్ని దేవుడిలా చూసుకుంటారు, సెలవు అన్నా. రాజమోహన్ రెడ్డి, రైతు, రైల్వే కోడూరు మండలం, అన్నమయ్య జిల్లా అందరికీ నమస్కారం, సార్ నేను రెండు ఎకరాల్లో వేసిన అరటి పంట మే నెలలో గాలుల వల్ల నష్టపోయాను, దానికి రూ. 20,000 ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది, గత ఏడాది అధిక వర్షాల వల్ల పసుపు పంట నష్టపోతే దానికి రూ. 37,000 ఇన్సూరెన్స్ కింద వచ్చింది, దాంతో పంట వేసుకోవడానికి ఉపయోగపడింది, ఇదే కాకుండా రైతు భరోసా సాయం అందుతుంది, అంతేకాక ఆర్బీకే ద్వారా అన్నీ ఇస్తున్నారు, డ్రిప్ పరికరాలకు కూడా రూ. 2 లక్షలకు 10 శాతం సబ్సిడీతో ఇవ్వడం వల్ల రైతులకు ఉపయోగంగా ఉంది. చాలా సంతోషం, వ్యవసాయ శాఖ అధికారులు మాకు తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నారు, రైతులకు 9 గంటలు నిరంతరాయంగా విద్యుత్ ఇస్తున్నారు. నేను 40 ఏళ్ళుగా చూస్తున్నాను ఏ ప్రభుత్వం కౌలు రైతులకు సాయం చేయలేదు, కానీ మీరు సాయం చేస్తున్నారు, పంటకు ధర లేకపోతే ప్రభుత్వమే కొనుగోలు చేసి సాయం చేస్తుంది, గతంలో ఎవరూ చేయని విధంగా వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు, నాడు నాన్నగారు ఇప్పుడు మీరు రైతులను ఆదుకుంటున్నారు, మీరు చిరకాలం సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.