ఏపీకి బాబు, పవన్‌ రాహుకేతువుల్లా త‌యార‌య్యారు

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

నెల్లూరు: ప్రభుత్వంపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని నారా లోకేష్‌.. వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ అన్నారు. నెల్లూరులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బుడబుక్కల పవన్‌ పగటి వేషాలు వేస్తున్నాడని, ఏపీకి చంద్రబాబు, పవన్‌ రాహుకేతువుల్లా త‌యార‌య్యారని మండిపడ్దారు. ప్రభుత్వంపై బురదజల్లడమే ఈనాడు పత్రిక పనిగా పెట్టుకుందన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top