ఎమ్మెల్యే మేక‌పాటికి మంత్రి కాకాణి ప‌రామ‌ర్శ‌

నెల్లూరు:   ఉదయగిరి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డికి ఇటీవ‌ల గుండెపోటు రావడంతో చెన్నైలోని అపోలో ఆసుప‌త్రిలో వైద్య‌చికిత్స‌లు అందిస్తున్నారు. ఈ మేర‌కు కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి చెన్నై గ్రీమ్స్ రోడ్డులోని అపోలో హాస్పిటలో శస్త్రచికిత్స చేయించుకున్న ఉదయగిరి శాసనసభ్యులు  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ని క‌లిసి, పరామర్శించారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆకాంక్షించారు. అనంత‌రం అపోలో హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ప్రతాప్.సి. రెడ్డి, అపోలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రీతారెడ్డి ని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి క‌లిశారు.

Back to Top