ట్విట్టర్‌లో కాదు పవన్‌.. దమ్ముంటే విజయవాడకు రావాలి

మంత్రి జోగి రమేష్‌ సవాల్‌
 

తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు మంత్రి జోగి రమేష్ స‌వాలు విసిరారు. ‘పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు చెంచా. పవన్‌ నువ్వు ఉండేది హైదరాబాద్‌లో.. షూటింగ్స్‌ విదేశాల్లో.. ఏపీలో గ్రౌండ్‌ రియాలిటీస్‌ నీకేం తెలుసు?. చంద్రబాబు ఏ ట్వీట్‌ పెట్టమంటే పవన్‌ అది పెడతాడు. పవన్‌ ట్వీట్లు సినిమా డైలాగుల్లానే ఉంటాయి. 2024లో పార్టీని చంద్రబాబుకు అమ్మేడానికి పవన్‌ సిద్ధంగా ఉన్నాడు. ట్విట్టర్‌లో కాదు పవన్‌.. దమ్ముంటే విజయవాడ రావాలి. పవన్‌ను ప్రశ్నించిన అంశంపై నేను చర్చకు సిద్ధం’ అని మంత్రి జోగి ర‌మేష్‌ ఓపెన్‌ సవాల్‌ విసిరారు.  

 

Back to Top