ఎన్టీఆర్ కి భారతరత్న సాధించలేని దద్దమ్మ చంద్ర‌బాబు

మంత్రి జోగి ర‌మేష్‌
 

అమ‌రావ‌తి: ఐదేళ్లు ఎన్‌డీఏతో పొత్తులో ఉండి కూడా ఎన్టీఆర్‌కు  భారతరత్న సాధించలేని దద్దమ్మ చంద్ర‌బాబు అని మంత్రి జోగి ర‌మేష్ విమ‌ర్శించారు. అసెంబ్లీ చివరి రోజు కూడా సభను సజావుగా జరగనివ్వకుండా టీడీపీ అడ్డుకుంటోందన్నారు మంత్రి జోగి రమేష్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అంశంపై చర్చ జరిపి మాట్లాడాలని అన్నారు. నిజంగా టీడీపీ వారికి ఎన్టీరామారావు మీద చిత్తశుద్ధి ఉందా? ఎన్టీరామారావు గారి ఆత్మ క్షోభించే విధంగా ఆయన పెట్టిన పార్టీని, పార్టీ గుర్తుని, ఆయన కట్టిన తెలుగుదేశం పార్టీఆఫీస్ ని లాక్కుని నేడు ఎన్టీఆర్ మీద ప్రేమ ఉందని అంటున్నారని దుయ్యబట్టారు.
ఎన్టీఆర్ మీద చంద్రబాబుకు ప్రేమ లేదని, వైయస్ జగన్ కు మాత్రమే నిజమైన ప్రేమ ఉందని తెలిపారు. అందుకే నాడు పాదయాత్రలో నిమ్మకూరులో ఎన్టీఆర్‌ పేరు చిరస్థాయిగా ఉండేలా కృష్ణాజిల్లాకు పెడతానని చెప్పి, ఆ మాటను తూచా తప్పకుండా అమలు చేసి చూపించారని తెలిపారు. 
చంద్రబాబు 14ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసాడు. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చంద్రబాబు ఎన్టీరామారావు పేరు తలవడు. అధికారం కోల్పోయినప్పుడు మాత్రమే ఎన్టీఆర్ పేరు తలుస్తాడని,  ఫొటో పెట్టి, దండవేస్తారని ఎద్దేవా చేసారు మంత్రి జోగి రమేష్. 
ఇంత ఘోరంగా ఎన్టీరామారావుగారిని హింసించి, ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు అండ్ కోకి ఎన్టీఆర్ పై ఏం చిత్త శుద్ధి ఉందని ప్రశ్నించారు. 
జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఎన్టీ రామారావుగారిని గౌరవించింది కేవలం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. 
ఎన్టీరామారావ్ కి భారతరత్న ఇవ్వాలంటాడు చంద్రబాబు. కానీ ఇదే బాబు కేంద్రంలో  NDA ప్రభుత్వంలో ఉండి, వారితో అంటకాగినప్పుడు ఎన్టీఆర్‌ కి భారతరత్న ఇవ్వాలని ఆలోచన చేయలేదని విమర్శించారు జోగిరమేష్. అధికారం పంచుకున్నప్పుడు ఎన్టీఆర్ కి భారతరత్న సాధించలేని దద్దమ్మ, అధికారం పోయాక ఎన్టీఆర్ కి భారతరత్న ఇవ్వాలని  డ్రామా చేస్తున్నాడు. 
ఎన్టీఆర్ పేరుని చిరస్థాయిగా పదికాలాల పాటు సార్థకంగా  చేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారే అన్నారు మంత్రి. ఆయన పేరు మీద మంచి ఆలోచనలతో ముందడుగు వేస్తాం కానీ టీడీపీలాగా నీచమైన బుద్ధితో ఆలోచన చేయమని అన్నారు జోగి రమేష్. 

డా.వైయస్సార్ హైల్త్ యూనివర్సిటీ పెట్టడానికి కారణం - ఆరోగ్య సంస్కరణలు తెచ్చింది వైయస్సార్ కనుకే అన్నారు జోగి రమేష్. ఆరోగ్యశ్రీ పెట్టి, 108 తెచ్చి, 104, తెచ్చి, పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచించిన ఏకైక నాయకుడిగా డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి గడపలోనూ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారన్నారు.

వైద్యం కోసం లక్షలు ఖర్చు చేయలేని పేదవాడు వైయస్సార్ ఇచ్చిన ఆరోగ్యశ్రీ కార్డుతో సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ కి వెళ్లి బల్లగుద్ది అడిగి మరీ వైద్యం చేయించుకోగలిగే అర్హత కల్పించారు మహానేత డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి. 

వందల, వేలమందికి ప్రాణాలను నిలబెట్టింది 108

గ్రామాల్లోకి వెళ్లి వైద్యులందరూ వైద్యం అందించేలా ప్రవేశపెట్టిందే 104

పేదల ఆరోగ్యం గురించి ఆలోచించిన పేదల డాక్టర్, ఒక్కరూపాయి డాక్టర్ డా.వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరు హెల్త్ యూనివర్సిటీకి ఉండటం న్యాయం అని, సముచితం అని భావించి బిల్ తెచ్చాం. 

పామర్రు వద్ద ఉన్న చెరువు సుందరీకరణ చేసి అక్కడ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు సీఎం వైయస్ జగన్. దీనిబట్టే ఎన్టీఆర్ పట్ల చిత్తశుద్ధి ఎవ్వరికుందో ప్రజలు అర్థం చేసుకుంటారన్నారు జోగి రమేష్. 
  
ఇక్కడ పుట్టి పెరిగి, కీర్తిని పెంచిన ఎన్టీఆర్ పేరు, ప్రతిష్టను నిలబెడతామని, ఇంకా మెరుగ్గా ఆయన పేరు చిరస్థాయిగా ఉండేలా చేస్తామని తెలియజేస్తున్నామని తెలిపారు. 

ఏదో పొడిచేస్తానని పాదయాత్ర చేద్దామనుకున్నాడు లోకేష్. లోకేష్ పాదయాత్రలో ఏమి చెబుతాడు? 14ఏళ్ల కాలంలో వాళ్ల అయ్య ఏం పీకాడని చెప్పగలడు? మూడేళ్ల కాలంలో మా ప్రభుత్వం చేసిన 30 పథకాలు  మేం చెప్పగలం. మీనాన్న చేసిన పథకాలేమిటో చెప్పాలని లోకేష్ కి నేను సవాల్ చేస్తున్నానన్నారు జోగి రమేష్. 

లోకేష్ ఇంకో ఆయన ఇద్దరూ చెరో వైపు పాదయాత్ర కాదు పొర్లుదండాలు పెట్టినా, మోకాళ్లతో యాత్ర చేసినా మిమ్మల్ని ప్రజలు క్షమించరు. చంద్రబాబు, లోకేష్, దత్తపుత్రులను నమ్మనే నమ్మరన్నారు. 

2014లో మూడు పార్టీలు కలిసి ఎన్నికలకు వెళ్లి, ప్రజలు నమ్మి నమ్మ ఓట్లేసాక ముగ్గురూ మూడు ముక్కలయ్యారన్నారన్నారు మంత్రి. వైయస్సార్ వ్యతిరేక ఓటంతా కూడగడతామని ప్రగల్బాలు పలుకుతున్నారు. అమ్మ ఒడి ఇస్తున్నందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేక ఓటు ఉంటుందా, చేయూత ఇస్తున్నామని, ఆసరా ఇస్తున్నామని, పెన్షన్లు, 31 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నామని, ఇంటింటికీ ఠంచనుగా 1వతేదీకి పెన్షన్ పంపుతున్నామని ఉంటుందా? దేనికి మా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుందని ప్రశ్నించారు జోగి రమేష్. 
పనికిరారని ప్రజలు ఊడబీకేసిన తెలుగుదేశం పార్టీ వాళ్లు మాత్రమే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకులు కానీ ప్రజలు కాదని అన్నారు మంత్రి జోగి రమేష్.

తాజా వీడియోలు

Back to Top