చంద్రబాబు రాజకీయ జీవితం పాపాలమయం

వైయస్‌ఆర్‌ సీపీ, వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత బాబుకు లేదు

పొత్తులు, ఎంగిలి మెతుకులకు ఆశపడే కుక్క చంద్రబాబు

14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రానికి ఏమీ చేయలేని చవట సన్నాసి బాబు

2019లోనే ప్రజలు చంద్రబాబును బట్టలూడదీసి తరిమికొట్టారు

బాబు, పవన్‌ తలకిందులుగా తపస్సు చేసినా.. మా పార్టీని ఇంచు కూడా కదిలించలేరు

గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌

తాడేపల్లి: చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ కలిసి తలకిందులుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా వైయస్‌ఆర్‌ సీపీని ఇంచు కూడా కదిలించలేరని, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి, సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని, ఎంగిలిమెతుకులకు ఆశపడే కుక్క చంద్రబాబు అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు బట్టలూడదీసి తరిమికొట్టారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ మేలు చేయలేని చవట సన్నాసి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి జోగి రమేష్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్‌ ఏం మాట్లాడారంటే..
``అతి తొందరగా పోయే రోగం చంద్రబాబుకు వచ్చేసింది. 2019 ఎన్నికల్లో అల్రడీ చంద్రబాబును బట్టలూడదీసి కొట్టి పంపించేశారు. నీ పనిఅయిపోయింది. నీ మోసాలు, ఘోరాలు, వెన్నుపోట్లు, దోపిడీ ఒక చాలు, నువ్వు 23 సీట్లకే పరిమితం అని ప్రజలు చంద్రబాబును బట్టలూడదీసి నడిరోడ్డు మీద నిలబెట్టారు. కర్నూలు వెళ్లి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడు. మా ప్రాంతానికి కూడా న్యాయం కావాలని, వికేంద్రీకరణలో మా ప్రాంతం భాగం కావాలని, అభివృద్ధి చెందాలని కర్నూలు ప్రజలంతా ప్లకార్డులు పట్టుకొని మూడు రాజధానుల నినాదాన్ని ముక్తకంఠంతో వినిపించారు. 

బట్టలూడదీసి కొడతానని కర్నూలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఇంతగా దిగజారిపోవడం ఎప్పుడైనా చూశామా..? అసలు చంద్రబాబు ఇంత ఫ్రస్టేషన్‌కు ఎందుకు గురవుతున్నాడో చెప్పాలి. 45 సంవత్సరాల రాజకీయ జీవితం ఒక్క ఓటు వేయమని అడుక్కుంటుంది. ఆ ఓటుతో రాష్ట్ర భవిష్యత్తును నిర్మిస్తాడట పనికిమాలిన చంద్రబాబు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రానికి ఏమీ చేయలేని చవట సన్నాసి నారా చంద్రబాబు. రాష్ట్రం విడిపోయిన తరువాత సీనియర్‌ అని అందరి కాళ్లు పట్టుకొని పవన్, బీజేపీతో కలిసి గద్దెనెక్కాడు. ఐదు సంవత్సరాలు ఏమీ చేయలేక చవట సన్నాసిలా చంద్రబాబు మిగిలిపోయాడు. ప్రజలంతా పనికిమాలిన చంద్రబాబు పనికిరాడనే అభిప్రాయానికి వచ్చి 175 స్థానాల్లో 23 స్థానాలకు చంద్రబాబును పరిమితం చేశారు.  

చంద్రబాబు రాజకీయ జీవితం పాపాలమయం. తెలుగుదేశం పార్టీ నాదీ అని చంద్రబాబు చెప్పుకోగలడా..? ఎన్టీఆర్‌ పార్టీ పెడితే దొడ్డిదారిన ఆయన చంకలో చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచి, ఆయనపై రాళ్లు, చెప్పులు వేయించి నరకయాతనకు గురిచేసి పైకి పంపించాడు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గురించి, సీఎం వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ఎంగిలిమెతుకులకు ఆశపడే కుక్క చంద్రబాబు. మా లీడర్‌ వైయస్‌ జగన్‌ దమ్మున్న నాయకుడు. పార్టీ స్థాపించాడు, దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 175స్థానాలకు 151 స్థానాల్లో పార్టీని గెలిపించాడు. సీఎం వైయస్‌ జగన్‌ స్థాపించిన పార్టీ, వైయస్‌ జగన్‌ జెండా ఎగరవేసే పార్టీ మాది.

కూల్చేస్తా, పడేస్తా, పాతరేస్తా అని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. సిగ్గుమాలిన చంద్రబాబుకు ఎప్పుడూ పొత్తుల గోల. బాబు రాజకీయ జీవితమే అతుకుల బొంత. చంద్రబాబు, పవన్‌ ఇద్దరూ కలిసి తలకిందులుగా తపస్సు చేసినా, పొర్లు దండాలు పెట్టినా వైయస్‌ఆర్‌ సీపీని ఇంచు కూడా కదిలించలేరు’’ అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. 
 

Back to Top