ఆ రాయి "పసుపు" రాయి.. అందుకే బాబుకు తగలలేదు! 

రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ 

ఒక పక్కేమో రెక్కీ.. మరోవైపేమో రాయి*

 రాయి ఘటన వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిదో తేల్చాలని డీజీపీని కోరుతున్నాం.*

 విధ్వసం బాబు రాజకీయ డిక్షనరీలోనే ఉంది*

 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పే దమ్ముందా బాబూః జోగి రమేష్ సవాల్*

 పార్ట్-3 డ్రామాకు రేపు ఇప్పటం గ్రామానికి పవన్ కల్యాణ్..!*

 మంత్రి జోగి రమేష్

 తాడేప‌ల్లి:  నందిగామ స‌భ‌లో విసిరిన‌  ఆ రాయి "పసుపు" రాయి.. అందుకే  చంద్ర‌బాబుకు తగలలేద‌ని,  అంతా బాబు స్క్రిప్టే అని  రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు నందిగామ సభలో మరోసారి రాయి డ్రామా ఆడారు. ఇలా.. బహిరంగ సభల్లో రాయి విసిరించుకోవడం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్రలో ఒక కోణం. ఆ రాయి విసిరిన వ్యక్తి పసుపు రంగు వ్యక్తా? ఆ రాయి పసుపుదా! అనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో నీచమైన విషపు పురుగు చంద్రబాబు నాయుడు.  చీఫ్ సెక్యూరిటీ అధికారికి ఆ రాయి తగలడం దురదృష్టకరం. ఈ ఘటనకు ముందుగా క్షమాపణ కోరాల్సిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. ఈ నాటకానికి ప్రేరేపించిన చంద్రబాబు మాత్రమే. బహిరంగ సభలో మాట్లాడుతుంటే నీ మీద మేము రాయి విసిరిస్తామా?. 

 మా మనసున్న, దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ గారిని అక్రమంగా అరెస్ట్ చేసి, జైలుకు పంపించినా మా వైయస్సార్ సీపీ శ్రేణులు ఎప్పుడూ ఎలాంటి అరాచకానికిగానీ, అల్లర్లకుగానీ, మీలా ఉన్మాద కార్యక్రమాలకుగానీ పాల్పడలేదు. శాంతియుతంగా రాజకీయాలు చేస్తూ, ప్రజల మనసులను గెలుచుకుని, 151 స్థానాలను కైవసం చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్ మోహన్ రెడ్డిగారికి వారి గుండెల్లో చోటిస్తే... మేము మీపై రాళ్లు వేస్తామా? విధ్వంసం సృష్టిస్తామా?. మాకెందుకు ఆ అవసరం ఉంటుంది.?
 మా నాయకుడి ఆలోచన, 2024లో మా లక్ష్యం ఒక్కటే.. 175కు 175 స్థానాలు గెలచుకోవడం.అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకూ చేరువ కావాలని మా నాయకుడు తపన పడుతున్నారు. 175 స్థానాల సాధన కోసం దశ, దిశ నిర్దేశం చేస్తున్నారు. 

 విధ్వసం బాబు రాజకీయ డిక్షనరీలోనే ఉంది 
        మా ప్రజా ప్రభుత్వంలో దిక్కుమాలిన, పనికిమాలిన, దుర్మార్గుడైన చంద్రబాబు మీద రాళ్లు వేయిస్తామా? మేము సంస్కారులం. చంద్రబాబు నాయుడు కుసంస్కారి అని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తాను రాసిన పుస్తకంలోనే స్వయంగా వెల్లడించారు.  టీడీపీ హయాంలో ఏదైనా బంద్ జరిగితే.. నాలుగు ఆర్టీసీ బస్సులు అయినా తగలబెట్టకపోతే అది బందే కాదని చంద్రబాబు చెప్పేవాడట. విధ్వంసకారి, దుర్మార్గుడు, రాక్షసుడైన చంద్రబాబుకు ఆ బుద్ధులన్నీ వెన్నతో పెట్టిన విద్య. ఒకసారి చంద్రబాబు తన చరిత్ర ఏమిటో వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిది. రాజకీయ ప్రస్థానం ఎక్కడ నుంచి ప్రారంభించి ఏ పార్టీలో చేరావో గుర్తు తెచ్చుకో.  ఎన్టీ రామారావు గారి పంచన చేరి కుట్రలు, కుయుక్తులతో ఆయననే పైకి పంపించిన వ్యక్తి చంద్రబాబు. ఇలా రాళ్లేయించుకోవడం నీకేమైనా కొత్తా?. 
- రాయి ఘటన వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఎవరిదో తేల్చాలని డీజీపీగారిని కోరుతున్నాం. ఈ ఘటనకు చంద్రబాబు బాధ్యుడు అయితే ఆయన్నీ వదిలేది లేదు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఇలాంటి దుర్మార్గపు పనులకు ఒడిగట్టే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఒక్కరు ఉన్నారు.. ఆయనే చంద్రబాబు నాయుడు.

 చంద్రబాబు నైజం వెన్నుపోటు, కుట్ర రాజకీయాలే. విలువలు, విశ్వసనీయతలు లేని ఇలాంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండటం రాష్ట్ర ప్రజల దురదృష్టం. ప్రతిపక్ష నాయకుడు అనేవాడు ప్రజా సమస్యలపై పోరాడతారు. చంద్రబాబు అసెంబ్లీకి రాడు. సమస్యలు ఏమైనా ఉంటే ప్రస్తావించే తీరిక, ఓపిక లేదు. రోడ్లమీద పడి రాళ్లు వేయించుకుంటాడు. పైపెచ్చు కుట్రలు అంటూ గొంతు చించుకుంటాడు. దీని వెనుక ఎవరున్నారనేది తేల్చి వారిని అరెస్ట్ చేయిస్తాం. 

 ఒక పక్కేమో రెక్కీ.. మరోవైపేమో రాయి 
        సభలో అంతమంది ఉంటే ఒక రాయి వచ్చి పడిందా? లేక చంద్రబాబు నాయుడే వేయించుకున్నాడా?.  ఒక పక్కేమో రెక్కీ, మరోవైపేమో రాయి. నిన్నటి వరకూ పవన్ కల్యాణ్ మీద హైదరాబాద్ లో రెక్కీ నిర్వహించారట. పవన్ మీద కుట్ర పన్ని, దాడి చేసేందుకు యత్నిస్తున్నారంటూ చంద్రబాబు, అచ్చెన్న, బుచ్చయ్య లాంటి వాళ్ళంతా ప్రెస్ మీట్ లు పెట్టి నోరు పారేశుకున్నారు.  తీరా చూస్తే ఏం జరిగింది?  కొంతమంది వ్యక్తులు తాగి గలాటా చేసుకున్నారని తెలంగాణ పోలీసులు తేల్చారు. రెక్కీ కాదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు కదా.. మరి ఇప్పుడేమంటారు.? . తాగుబోతుల గలాటా వల్ల ఇబ్బంది కలిగిందని, పవన్ కల్యాణ్ మీద రెక్కీ లేదు బోక్కా లేదంటూ చివరకు మీ చెంపమీద ఛెళ్లున కొట్టినట్లు తెలంగాణ పోలీసులు తేల్చారు కదా.
 పార్ట్-1 రెక్కీ, పార్ట్-2 రాయి విసరడం అట. అయినా పనికిమాలినవాళ్ల మీద రెక్కీలు, రాళ్ళు విసరాల్సిన అవసరం మాకేంటి?
 మా నాయకుడి ఆదేశాలతో ఎమ్మెల్యేలం అయినా..  ప్రతి గడపకు వెళ్లి అవ్వా, తాతా, అక్కచెల్లెమ్మలను పలకరిస్తూ జగనన్న సంక్షేమ పథకాలను ఇంటింటా వివరిస్తున్నాం. పథకాలు చేరువ అయ్యాయా? ఇబ్బందులు ఉన్నాయా అని గడప గడపకూ తిరుగుతున్నాం. 
 రెక్కీ, రాళ్ళంటూ గగ్గోలు పెట్టి మీడియా ముందుకు రావడం. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మీరు వ్యవహరిస్తున్నారు. ఈ రాయి సంగతి కూడా తేల్చుతాం. రాయి ఎవరు వేయమన్నాడు? రాయి ఎవరితో వేయించుకున్నాడు? అది తెల్లరాయా? పసుపు రాయా? ఏ రాయి అన్నది కూడా తేలిపోతుంది. చంద్రబాబు బండారం కూడా బయటపెట్టిస్తాం.
 మల్లెల బాబ్జీ ఎన్టీఆర్ గారి మీద కత్తితో దాడిచేశాడని అప్పట్లో హడావుడి చేయించారు. ఆ దాడి ఎవరు చేయించారో రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు. మల్లెల బాబ్జీని ఎవరు ప్రేరేపించారో కూడా తెలుసు? మళ్లీ అతడు ప్రాణాలతో లేకుండా పోయాడు.
 చరిత్రలో రాక్షసులు, శిఖండులను చూశాం. ఇప్పుడు చంద్రబాబు అలాంటి పాత్ర పోషిస్తున్నాడు.

 అంతా బాబు స్క్రిప్టే.. రేపు పార్ట్-3కి పవన్ కల్యాణ్.. 
        చంద్రబాబు ముందే స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాడు... ఉత్తరాంధ్రలో కూడా ఇలానే విధ్వంసం చేస్తానని చెబుతున్నాడు.  స్క్రిప్ట్ సిద్ధం చేసుకుని, దానితో పాటు రాయి వేయించుకునేందుకు చంద్రబాబు రెడీ అయ్యే నందిగామ వెళ్లాడు. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కూడబలుక్కుని నాటకాలు ఆడుతున్నారు. రేపు మళ్లీ ఇప్పటం వెళ్లి పవన్ కల్యాణ్ చేసేదేంటి? అక్కడ కొంతమంది అక్రమ నిర్మాణాలు చేపడితే.. వాటిపై అధికారులు మే నెలలోనే వారికి నోటీసులు ఇచ్చారు. వాటిని ఇవాళ కూలగొట్టారు. వారిలో కాపులు, రెడ్లు, గౌడ కులాల వాళ్లు ఉన్నారు. వాళ్లంతా ఇష్టపూర్వకంగానే వెళ్లారు. దానీ మీద రేపు పార్ట్-3 షురూ చేస్తున్నారు. చంద్రబాబు జగ్గయ్యపేట నుంచి హైదరాబాద్ వెళితే... పవన్ హైదరాబాద్ నుంచి ఇక్కడకు వస్తాడట.
 దిక్కుమాలిన ఇద్దరూ కూడబలుక్కుని ఎవరేమి చేయాలో పథకం ప్రకారం రెక్కీ, రాయింటూ హంగామాలు చేసి.. అలజడులు సృష్టించాలని చూస్తున్నారు. 
 ఇలాంటి పనికిమాలినవాళ్లను పట్టించుకునే సమయం, తీరికా మాకు లేదు. ఎవరు ఎక్కడకు పోతే మాకెందుకు?. వీళ్లకు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడంతో పాటు, కులాలను, ప్రజలను రెచ్చగొట్టడమే పని.  అయ్యన్నపాత్రుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుంటే... పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటే తప్పేంటి అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడు. 2 సెంట్లు అయినా భూమే కాదా?, ఆక్రమణే కదా..?. అంటే వందల ఎకరాలు ఆక్రమించుకోవాలా? ఇలాంటి పనికిమాలిన సలహాలు ఇచ్చే నాయకుడు మన ప్రతిపక్షనేత చంద్రబాబు. 

 175 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పే దమ్ముందా బాబూః జోగి రమేష్ సవాల్ 
        జైలుకు వెళతాడు, బంగాళాఖాతంలో కలిపిపోతాడని చంద్రబాబు పెద్ద పెద్ద డైలాగులు చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు 2019 ఎన్నికల్లో ఇదే మాట ఊరు, వాడ చెప్పుకు తిరిగిన వ్యక్తి. మరి ప్రజలేం చేశారు? నిన్ను 23 సీట్లకు పరిమితం చేయడం మర్చిపోయావా? 151 సీట్లతో మాకు పట్టం కట్టారు. చంద్రబాబు మళ్లీ అలాంటి కారుకూతలే కూస్తున్నాడు.  దమ్ము, ఖలేజా ఉంటే తెలుగు దేశం పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పే సత్తా.. పనికిమాలిన చంద్రబాబు నాయుడుకు ఉందా అని సవాల్ చేస్తున్నా.
 జనసేన పార్టీ కూడా 175 స్థానాల్లో పోటీ చేస్తుందని, తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని, ప్రజలు తనకు ఓటు వేయాలని దిక్కుమాలిన పవన్ కల్యాణ్ ను అయినా చెప్పమనండి. కానీ, ఇద్దరూ చెప్పలేరు. దమ్మున్న నాయకుడు, మనసున్న ముఖ్యమంత్రిని ప్రజల మనసుల్లో నుంచి దూరం చేయాలన్నదే వీళ్ళందరి కుట్ర. అందుకే ఇద్దరూ కలిసి కూడబలుక్కుని కుట్రలు పన్నుతున్నారు. పొత్తులు పెట్టుకుని పొర్లాడాలని అనుకుంటున్నారు.
 2014లో పొత్తులు పెట్టుకుని ఏం చేశారు? రాష్ట్రాన్ని నట్టేట ముంచింది మీరు కాదా?. అందుకే 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును మర్చిపోతున్నారా? మళ్లీ పొత్తులు పెట్టుకుని, ఎవరు ఏ పార్టీతో ఎంతకాలం ఉంటారో తెలియదు. పొద్దున ఓ పార్టీకి విడాకులు ఇచ్చి..  సాయంత్రం మరో పార్టీని పెళ్లి చేసుకోవడం వీళ్ళకు అలవాటు. ఇలాంటి పనికిమాలిన వ్యక్తులు ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని, మనసున్న ముఖ్యమంత్రిగారిపై నిందలు వేయాలని, కుట్రలు చేసేందుకు వాళ్లంతట వాళ్లే రెక్కీలు, రాళ్లు వేయించుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనిస్తున్నారు. రెక్కీ సంగతి తేలిపోయింది. ఇక రాయి సంగతి కూడా పోలీసులు తేల్చుతారు.

Back to Top