న‌వ‌ర‌త్నాల‌తో ప్ర‌తి ఇంటా సంతోషం

కొంకేపూడి, ఈదుముడి గ్రామాల్లో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం

పాల్గొన్న గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్‌

పెడ‌న‌: ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాల‌న‌లో ప్ర‌తీ కుటుంబం సంతోషంగా ఉంద‌ని, న‌వ‌ర‌త్నాల‌తో పేద‌ల ముఖాల్లో వెలుగులు నిండాయ‌ని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి ర‌మేష్ అన్నారు. పెడ‌న మండ‌లం కొంకేపూడి స‌చివాల‌య ప‌రిధిలోని కొంకేపూడి, ఈదుముడి గ్రామాల్లో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో మంత్రి జోగి ర‌మేష్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్ర‌భుత్వం నుంచి అందుతున్న సంక్షేమ ప‌థ‌కాల గురించి ప్ర‌జ‌లను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి వివ‌క్ష‌, అవినీతి లేకుండా అర్హులంద‌రికీ సంక్షేమ సాయం నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ల‌లో జ‌మ అవుతుంద‌ని చెప్పారు. పేద‌ల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న కొన‌సాగుతోంద‌ని ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు. అక్క‌చెల్లెమ్మ‌ల ఆర్థికాభివృద్ధికి ముఖ్య‌మంత్రి కృషిచేస్తున్నార‌ని చెప్పారు. గ్రామాల్లో నెల‌కొన్న స‌మ‌స్య‌ల‌ను గుర్తించి వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని మంత్రి జోగి ర‌మేష్ అధికారుల‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయం సిబ్బంది, వలంటీర్లు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top