వైయస్‌ఆర్‌ బీమా క్లెయిమ్‌ల చెల్లింపునకు రూ.348 కోట్లు విడుదల

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం

తాడేపల్లి: కరోనా కష్టకాలంలో పేదల కోసం ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో  వైయస్‌ఆర్‌ బీమా క్లెయిమ్‌లన్నీ చెల్లిస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి జయరాం తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గుమ్మనూరు జయరాం మాట్లాడుతూ.. వైయస్‌ఆర్‌ బీమా చెల్లింపుల కోసం రూ. 348 కోట్లు విడుదల చేశామన్నారు. మార్చి 31 వరకు పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌లన్నీ చెల్లిస్తామన్నారు. 7,726 క్లెయిమ్‌ల మొత్తాన్ని జమ చేస్తామని, ఈ మొత్తాన్ని సెర్ప్‌ ద్వారా లబ్ధిదారులకు డబ్బులు అందిస్తామన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top