కరోనా కష్టకాలంలోనూ ఆగని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు

మంత్రి గుమ్మనూరు జయరాం

తాడేపల్లి: ప్రపంచమంతా కరోనాతో అల్లాడిపోతుందని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఆగడం లేదని మంత్రి గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌ బీమా పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి మాట్లాడారు. కోవిడ్‌–19 వచ్చింది. అన్ని మూత పడ్డాయని బయట చెప్పుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రం ఆగకుండా కొనసాగుతున్నాయని చర్చించుకుంటున్నారు.  ఈ కార్యక్రమంతో మరోమారు అదే రుజువైంది. గతంలో బీమా పథకానికి కేంద్రం సగం, రాష్ట్ర ప్రభుత్వం సగంనిధులు ఇచ్చేది. 2019 వరకు కన్వర్‌జెన్సీ స్కీమ్‌ కింద ఈ పథకం కొనసాగేది. 2020 ఏప్రిల్‌లో కేంద్రం నిధులు ఇవ్వకుండా ఆపేసింది. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగిస్తోంది. పూర్తి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ బ్యాంకులకు చెల్లించింది. అయితే బ్యాంకుల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొన్నారు. నేరుగా బా«ధిత కుటుంబాలకు అందించాలనే ధృడ నిశ్చయంతో వైయస్‌ఆర్‌ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. బ్యాంకులతో సంబంధం లేకుండా ఈ పథకాన్ని ఈ ఏడాది నుంచి అమలు చేస్తున్నాం. 2021–2022 ఏడాదికి  1.32 కోట్ల పేద కుటుంబాలకు రూ.750 కోట్లతో బీమా సౌకర్యం కల్సిస్తున్నాం.  నేరుగా, త్వరగా బాధిత కుటుంబాలకు పరిహారం అందించే కార్యక్రమాన్ని రూపొందించామని మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి తీసుకొని నిర్ణయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అమలు చేస్తున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైయస్‌ఆర్‌ బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో 1.32 కోట్ల మంది పేద కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి కలుగుతుంది. పుట్టిన బిడ్డ మొదలు పండు వృద్ధుల వరకు మేలు చేసే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు ఐదు కోట్ల మంది ప్రజలు అండగా ఉంటారని మంత్రి తెలిపారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top