మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర

మంత్రి గుమ్మనూరు జయరాం
 

క‌ర్నూలు: మూడు రాజధానులపై చంద్రబాబు కుట్ర చేస్తున్నార‌ని మంత్రి గుమ్మనూరు జయ‌రాం మండిప‌డ్డారు. చంద్రబాబుకు రాష్ట్రాభివృద్ధి ఇష్టం లేదని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. క‌ర్నూలు గ‌ర్జ‌న కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడుతూ.. మూడు ప్రాంతాలకు సమన్యాయం చేయాలనే సీఎం వైయ‌స్ జగన్‌ ముందుకెళ్తున్నార‌ని చెప్పారు. ప్రజలకు ద్రోహం చేయాలని చంద్రబాబు చూస్తున్నార‌ని విమ‌ర్శించారు.  రాష్ట్రాభివృద్ధిని  అడ్డుకుంటున్న చంద్ర‌బాబుకు తగిన బుద్ధి చెప్పడానికి సీమ ప్రజలు సిద్ధంగా ఉన్నార‌ని హెచ్చ‌రించారు.  

కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం చెప్పారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు తెలుగు సినీ పరిశ్రమ మద్దతివ్వాలని కోరారు. కర్నూలులో ఎన్నో సినిమాల షూటింగులు జరుగుతున్నాయని... సినీ పరిశ్రమకు, కర్నూలుకు మంచి అనుబంధం ఉందని చెప్పారు. అందుకే కర్నూలులో హైకోర్టుకు సినీ పరిశ్రమ మద్దతును ఇవ్వాలని కోరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు మద్దతు తెలపాలని విన్నవించారు. 

తాజా వీడియోలు

Back to Top