కోట్ల సుజాతమ్మ కుటుంబానిది ఫ్యాక్షన్‌ రాజకీయం

కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం 

కర్నూలు: కరోనా వైరస్‌ నివారణకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని చర్యలు తీసుకుంటున్నారని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు 5 కోట్ల మంది ప్రజలను గాలికొదిలేసి.. హైదరాబాద్‌లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నాడని మండిపడ్డారు. మంత్రి జయరాం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేసేవన్నీ అసత్య ప్రచారాలేనని ధ్వజమెత్తారు. కష్ట సమయంలో ప్రజలకు సహాయం చేయకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు పేపర్‌ స్టేట్‌మెంట్లకే పరిమితమయ్యారన్నారు. కోట్ల సుజాతమ్మకు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని, సుజాతమ్మ కుటుంబానిదే ఫ్యాక్షన్‌ రాజకీయమని మంత్రి జయరాం ధ్వజమెత్తారు. వలస కూలీల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆధ్వర్యంలో కార్మిక శాఖ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటుంటే విమర్శలు చేయడం సరైనది కాదు. ఫ్యాక్షన్ రాజకీయంతో ఎంతో మంది ఆడపడుచులను వితంతువులగా మార్చిన ఘనత కోట్ల కుటుంబానికే దక్కుతుందన్నారు. దేశంలోనే ఎక్కువ కరోనా పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఏపీ అని, కరోనా కట్టడికి సీఎం వైయస్‌ జగన్‌ నిరంతరం సమీక్షలు జరుపుతూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. 

Back to Top