చిట్టివలస జూట్‌మిల్లు కార్మికులకు తీపి కబురు

విశాఖ: చిట్టివలస జూట్‌మిల్లు కార్మికులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. యాజమాన్యం, కార్మిక సంఘాలతో మంత్రి గుమ్మనూరు జయరాం చర్చలు సఫలమయ్యాయి. 6,481 మంది పర్మినెంట్‌ కార్మికులు, అప్రంటీస్‌లకు నష్టపరిహారం రూ.23 కోట్లు చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించింది. ఏడాదిలోగా చెల్లించేందుకు జూట్‌మిల్లు యాజమాన్యం అంగీకరించింది. దీంతో కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వానికి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.
 

Back to Top