ప‌వ‌న్‌..ఎక్కడ దాక్కున్నావ్ ?

మంత్రి గుడివాడ అమర్నాథ్ ట్వీట్‌
 

విశాఖ‌: గుంటూరులో టీడీపీ సభలో చోటుచేసుకున్న ప్రమాద ఘటనపై మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. ప్రమాద ఘటనపై ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోరు మెద‌ప‌క‌పోవ‌డం ప‌ట్ల మంత్రి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇప్పటం అభివృద్ధిలో భాగంగా గోడ కూల్చితే కారెక్కి ఎగేసుకుని వచ్చి రచ్చ చేసిన ప్యాకేజీ స్టార్. మొన్న కందుకూరు చంద్రబాబు మీటింగ్‌లో 8 మంది అమాయ‌క ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లిగొన్నారు. నిన్న గుంటూరులో చంద్ర‌న్న కానుక‌ల పంపిణీ కార్య‌క్ర‌మంలో మ‌రో ముగ్గురిని పొట్టన బెట్టుకుంటే ఎక్కడ దాక్కున్నావ్ ?  ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ ట్వీట్ చేశారు. 

Back to Top