ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు ఆకాంక్షలు గుర్తించండి

ఇకనైనా వెంటనే అరసవెల్లి పాదయాత్ర విరమించండి

మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ పిలుపు

విశాఖలో రాజధాని వద్దన్న అచ్చెన్నాయుడు 

ఆ వ్యాఖ్యలను ఇక్కడి వారంతా ఖండిస్తున్నారు

ఏనాడూ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోరని అచ్చెన్నాయుడు

చంద్రబాబు బంట్రోతులా బూట్లు నాకుతున్నారు

ఇక్కడ రాజధాని వద్దంటే నోరు మూసుకుని కూర్చోండి

అచ్చెన్నాయుడుకు సిగ్గుంటే వైఖరి మార్చుకోవాలి

తేల్చి చెప్పిన మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

ఈనెల 15న భారీ స్థాయిలో ‘విశాఖ గర్జన’

ఆ ప్రదర్శనకు అన్ని చోట్ల నుంచి భారీ మద్దతు

పవన్‌కళ్యాణ్‌వి అర్ధం లేని విమర్శలు. ట్వీట్లు

చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌ ఇద్దరూ ఒక్కటే

నాడు వికేంద్రీకరణను సమర్థించిన పవన్‌

ఒక్కసారి ఏం మాట్లాడావో గుర్తు చేసుకో

ప్రెస్‌మీట్‌లో పవన్‌కు సూచించిన మంత్రి

విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు ఆకాంక్షలు గుర్తించి ఇకనైనా వెంటనే అరసవెల్లి పాదయాత్ర విర‌మించాల‌ని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సూచించారు. విశాఖపట్నం సర్క్యూట్‌ హౌస్‌లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు.

‘గర్జన’కు ముందుకు:
    వికేంద్రీకరణకు మద్దతుగా జేఏసీ పిలుపు మేరకు ఈనెల 15న భారీ ర్యాలీ నిర్వహించబోతున్నాం.‘విశాఖ గర్జన’కు ఎక్కడికక్కడ అందరూ మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. మళ్లీ మనకు గొప్ప అవకాశం వచ్చింది. కాబట్టి వదులుకోవద్దు అని ఈ ప్రాంత ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోరుకునే వారు ముందుకు వస్తున్నారు కూడా.

ఇదీ అచ్చెన్నాయుడు తీరు:
    కానీ వింత ఏమిటంటే, ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు.. ఇంకా చెప్పాలంటే, ఈ ప్రాంతానికి చెందిన (ఉత్తరాంధ్ర)   అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కానీ ఆయన ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకోవడం లేదు. ఇక్కడ రాజధాని వద్దు. అమరావతిలోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీన్ని ఈ ప్రాంత ప్రజలంతా గమనించాలి. ఆయన గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏనాడు ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకోలేదు. ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు రావాలని అనుకోలేదు. 
    మీకు అధికారం కోసం ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కావాలి. కానీ ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం వద్దు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఇక్కడి వారంతా ఖండిస్తున్నారు. రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఆత్మహత్యలే ఉంటాయంటారు. ఇక్కడ అభివృద్ధి వద్దనే వారందరికీ, ఇక్కడ రాజధాని వద్దనే వారందరికీ అదే వర్తిస్తుంది. వారికి రాజకీయంగా ఇక సమాధి మాత్రమే.

ఇష్టం లేకపోతే మాట్లాడొద్దు:
    ఇక్కడ రాజధాని మీరు కోరుకోకపోతే, కనీసం నోరు మూసుకు కూర్చోండి. అంతేకానీ, చంద్రబాబునాయుడుకు బంట్రోతుల్లా తిరుగుతూ నష్టం కలిగిస్తుంటే, ఇక్కడి ప్రజలు ఊర్కే కూర్చోబోరు. అందుకే ఈ ప్రాంతానికి పాదయాత్ర పేరుతో దండయాత్రగా వస్తున్న వారి నోరు మూయించి, వారు తమ యాత్రను ఆపేసే విధంగా ఈనెల 15న ప్రదర్శన నిర్వహించబోతున్నాం.

విరమించుకొండి:
    అందుకే అరసవెల్లి పాదయాత్ర విరమించుకోమని పిలుపునిస్తున్నాం. కోర్టు అనుమతి ఇచ్చింది కదా, అని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. దీన్ని ఇక్కడి వారెవరూ చూస్తూ ఊర్కోబోరు. అందుకే వారి నోరు మూయించే విధంగా ఈనెల 15న ర్యాలీ నిర్వహిస్తాం. వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజల మనోభావాలు, ఆకాంక్షలు గుర్తించి, పాదయాత్ర విరమించండి.

ఆనాడు ఏమన్నావు?:
    ఇక చంద్రబాబు దత్తపుత్రుడు ఇవాళ విశాఖ గర్జనపై ట్వీట్లు చేశారు. ఆయన ఎప్పటిలాగే చంద్రబాబునాయుడు విధానాలు మాట్లాడారు. మీరు చంద్రబాబునాయుడు దత్తపుత్రుడు. అందుకే మీకు గర్జించడం తెలియదు. ఇక్కడి పరిస్థితులు మీకు తెలియదు. అయినా మీకు ఇక్కడి ఓట్లు కావాలి. అందుకే ఇక్కడ పోటీ చేశారు. కానీ ఓడిపోవడంతో కక్ష కట్టారు.
    మీరు గతంలో అమరావతి గురించి ఏమన్నారో గుర్తు చేసుకొండి. ‘ఎవరి రాజధాని అమరావతి’ అన్న పుస్తకావిష్కరణలో ఏం మాట్లాడారో గుర్తు చేసుకొండి. నా మనసులో కర్నూలు రాజధాని అని ఆనాడు అన్నారు. కానీ ఇవాళ విశాఖపై కక్ష కట్టి, చంద్రబాబు విధానాలకు అనుగుణంగా మాట్లాడుతున్నారు.

మనుషులు వేరు. మనసులు ఒకటే:
    పవన్‌కళ్యాణ్‌కు సినిమా జీవితాన్ని ఇచ్చింది విశాఖపట్నం. ఆయన ఇక్కడే నటనలో శిక్షణ పొందారు. చివరకు ఆయనకు పిల్లను కూడా విశాఖ ఇచ్చింది. కానీ ఆమెను వదిలేశాడు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే రకం పవన్‌కళ్యాణ్‌ది. దీన్ని ఎవరూ హర్షించరు. మీరు, చంద్రబాబు మనుషులు వేరైనా, మనసులు ఒకటే. అందుకే ఇద్దరూ ఒకటే మాట్లాడతారు. ఇది అందరికి తెలుసు. విశాఖకు వ్యతిరేకంగా మీ మాటలు అందరూ వింటున్నారు.

అచ్చెన్నాయుడుకు సిగ్గుంటే..:
    విశాఖ ప్రాంతం అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో మీ వ్యతిరేకతను ప్రజలంతా చూస్తున్నారు. అమరావతిలో భూముల ధరలు పెరగాలన్న మీ విధానాన్ని మానుకొండి. మీరు రాజకీయ జీవితంలో, ప్రజా జీవితంలో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా మీ విధానాన్ని మార్చుకోవాలి. అన్ని ప్రాంతాలు సమంగా చూడాలి.
    అచ్చెన్నాయుడుకు ఇంకా ఏమైనా సిగ్గు ఉంటే, ఈ ప్రాంతం ఇన్నిసార్లు నీకు రాజకీయ జీవితం ఇచ్చింది. మంత్రిని కూడా చేసింది. అయినా నీవు ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు. ఇప్పుడు ఈ ప్రాంతంలో రాజధాని కూడా వద్దంటున్నావు. నీ రాక్షస మనస్తత్వం, కేవలం బంట్రోతుగా చంద్రబాబు బూట్లు నాకుతాను, ఆయన చెప్పిందే చేస్తానన్న నీ ఆలోచన మానుకోవాలి.

రాజీనామాలు ఎందుకు?:
    రాజీనామా చేస్తామని మంత్రులెవరూ చెప్పలేదు. మా మంత్రులు కూడా ఏం చెప్పారు? ఇక్కడి ప్రజల ఆకాంక్ష, ఇక్కడ ఎదుగుతున్న ఉద్యమం చూసి, మాకు అందులో భాగస్వామ్యం కావాలని ఉంది. కాబట్టి సీఎంగారు అనుమతి ఇస్తే, అందులో పాల్గొంటామని మంత్రి ధర్మానగారు చెప్పారు. అంతే తప్ప రాజీనామా చేస్తానని ఆయన అనలేదు. 
    పైగా వికేంద్రీకరణకు ప్రభుత్వం అనుకూలంగా ఉంది కాబట్టి, ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాల్సిన అవసరం లేదని నేను చెప్పాను.

వారే రాజీనామా చేయాలి:
    అమరావతి మాత్రమే రాజధాని కావాలని తెలుగుదేశం కోరుతోంది. కాబట్టి దాని కోసం వారు రాజీనామా చేయాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌ సభ్యులు రాజీనామా చేశారు. ఇక్కడ మా ఆకాంక్షకు ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పుడు, మేమెందుకు రాజీనామా చేయాలి.
    ఈరోజు ఈ ప్రాంతం మీదకు వస్తున్న వారు, రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇక్కడ కూడా ఉద్యమాలు మొదలవుతున్నాయి. రాజధాని ఎంపిక అధికారం రాష్ట్రాలకే ఉందని కేంద్రం కూడా స్పష్టం చేసింది. మాకు ఆ హక్కు ఉందని చెప్పడానికే పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టాం. 

దానికే కట్టుబడి ఉన్నాం:
    మా ప్రభుత్వం మూడు రాజధానులకు కట్టుబడి ఉంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్, కర్నూలులో జ్యుడీషియల్‌ రాజధాని ఏర్పాటు అవుతుంది. బీజేపీ నాయకులకు విశాఖపై ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, ముందు స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకాన్ని అడ్డుకోమని చెప్పండి. జీవీఎల్‌ నరసింహారావు ఎందుకు విశాఖ గురించి మాట్లాడుతున్నారు? ఉత్తరాంధ్ర ప్రయోజనాల విషయంలో మేము ఎక్కడా రాజీ పడబోమ‌ని మంత్రి అమ‌ర్నాథ్ స్ప‌ష్టం చేశారు. 

తాజా వీడియోలు

Back to Top