బూతులు తిట్టిస్తూ చంద్రబాబు రాక్షసానందం

అది మహానాడు కాదు... బూతు నాడు

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం

మ్యానిఫ్యాక్చరింగ్‌ డిఫెక్ట్‌ ఉన్న వ్యక్తి అయ్యన్నపాత్రుడు

ఎవరు ఎక్కువ తిడితే వారికి మార్కులు వేస్తానన్నట్టుగా చంద్రబాబు వైఖరి

14ఏళ్లు సీఎంగా చేసిన బాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా..?

ఓటేసిన ప్రజలకు చంద్రబాబు ఒక్క పథకమైనా అమలు చేశారా..?

ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి చేశామని చెప్పే ధైర్యం టీడీపీకి ఉందా..?

సంక్షేమం, సామాజిక న్యాయం అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ను చూసి టీడీపీకి కడుపుమంట

చంద్రబాబును ప్రజలు వద్దనుకున్నారు కాబట్టే తరిమికొట్టారు

తాడేపల్లి: టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను, మంత్రులు, వైయస్‌ఆర్‌ సీపీ నేతలను తిట్టిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు రాక్షసానందం పొందుతున్నాడని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. పెద్ద మనిషిలా నాటకం ఆడుతూ ఎవరు ఎక్కువ తిడితే వారికి మార్కులు వేస్తాననే దుర్మార్గపు వైఖరితో చంద్రబాబు ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసి.. ఆ ప్రాంతానికి వెళ్లి మాట్లాడుతున్నందుకు సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. మందు తాగితే గానీ మాట కూడా రాని మ్యానిఫ్యాక్చరింగ్‌ డిఫెక్ట్‌ ఉన్న అయ్యన్న పాత్రుడుతో వ్యక్తిగత విమర్శలు, పచ్చి బూతులు తిట్టిస్తున్నాడని చంద్రబాబుపై మంత్రి అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడి మాటలు విన్న మహిళలు జన్మలో టీడీపీకి ఓటు వేయరని అభిప్రాయపడ్డారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. ‘పార్టీలో నాయకులు, కార్యకర్తల కొరతతో టీడీపీ మినీ టీడీపీగా తయారైంది. 14 ఏళ్ల సీఎంగా ఉండి వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వానికంటే మెరుగ్గా పథకాలు ప్రజలకు అందించానని, సీఎం వైయస్‌ జగన్‌కంటే బాగా పాలన చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? 

నవరత్నాలు ఎత్తేస్తానని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. సీఎం వైయస్‌ జగన్‌ అందిస్తున్న నవరత్నాల పథకాల ద్వారా రాష్ట్రంలోని రైతాంగం, మహిళలు, వివిధ వర్గాలకు, మరీ ముఖ్యంగా బడుగు, బలహీనవర్గాలకు రూ.1.41 లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో అందాయి. పేదల కోసం ఇంత మొత్తంలో ప్రత్యక్ష నగదు బదిలీ చేసిన ఏకైక ప్రభుత్వం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం. 

చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తే అసహ్యమేస్తోంది. ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు ప్రజల కోసం పనులు చేయడం చేతగాని చంద్రబాబు.. కేవలం 23 సీట్లకు పరిమితం చేసి.. ప్రజలు తరిమికొట్టిన తరువాత సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు. 3 సంవత్సరాల పాటు రాష్ట్రం వైపు కన్నెత్తి కూడా చూడని చంద్రబాబు.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెళ్లి మాట్లాడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలు తెలుసుకోలేని వ్యక్తి.. విశాఖపట్టణాన్ని రాష్ట్రానికి పరిపాలనా రాజధానిగా చేస్తానని చెప్పిన సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతించలేని వ్యక్తి చంద్రబాబు. ఉత్తరాంధ్ర మేలును, మంచిని అడ్డుకున్న వ్యక్తి.. ఆ ప్రాంతానికి వెళ్లి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఉత్తరాంధ్ర ప్రజలకు మంచి చేశానని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా..? చంద్రబాబు పేరు చెబితే ఈ పథకాలు గుర్తుకువస్తాయని చెప్పే దమ్ము టీడీపీ నేతలకు ఉందా..? 

వైయస్‌ఆర్‌ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాలు, 104, 108, పేదలకు ఇళ్ల నిర్మాణ కార్యక్రమాలు గుర్తుకువస్తాయి. సీఎం వైయస్‌ జగన్‌ పేరు చెబితే అమ్మఒడి పథకం, ఆసరా, చేయూత, రైతు భరోసా పథకాలు గుర్తుకువస్తాయి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 30 లక్షల కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చిన గొప్ప ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. 

ఎప్పుడూ లేనివిధంగా చంద్రబాబు.. ఎన్టీఆర్‌ నామస్మరణ చేస్తున్నాడు. జై ఎన్టీఆర్‌ అనే మాట చంద్రబాబు నోటి నుంచి ఏనాడైనా వచ్చిందా.. మహానాడు పెట్టినప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలనే తీర్మానం తప్ప..ఎప్పుడైనా ఎన్టీఆర్‌ పేరు ఉచ్ఛరించాడా..? చంద్రబాబు పేరు చెప్పుకుంటే ఓట్ల రాలవని, ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధంగా లేరని ఎప్పుడూ లేనిది కొత్తగా ఎన్టీఆర్‌ నామస్మరణ చేస్తున్నాడు. 

మ్యానిఫ్యాక్చరింగ్‌ డిఫెక్ట్‌ ఉన్న వ్యక్తి అయ్యన్నపాత్రుడు. అయ్యన్నపాత్రుడికి మందు తాగకుండా మాట కూడా రాదు. అటువంటి వ్యక్తి నాలుగు పెగ్గులు వేసిన తరువాత గొప్పగా మాట్లాడుతాడని ఎవరు అనుకుంటారు. మహిళా మంత్రిని ఉద్దేశించి అనుచితంగా మాటలు మాట్లాడుతున్నాడు. అయ్యన్న మాటలు విన్న ఏ మహిళ అయినా తెలుగుదేశం పార్టీకి జన్మలో ఓటు వేయదని నా అభిప్రాయం. అంత నీచమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో ఎవరూ, ఎన్నడూ చేయని విధంగా సీఎం వైయస్‌ జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మేలు చేస్తున్నారు. అది చూసి కడుపుమంట. బీసీ నాయకులతో వైయస్‌ఆర్‌ సీపీ నాయకులను తిట్టిస్తే బీసీలకు న్యాయం చేసినట్టుగా చంద్రబాబు ఫీలవుతున్నాడు.

వెనకబడిన వర్గాలు బాగా అభివృద్ధి చెందాలని భావించే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ మంత్రివర్గం మొదలు అన్ని చోట్లా వారికి ప్రాధాన్యం ఇచ్చారు. 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు 17 మంది ఉన్నారు. గతంలో ఎవరూ ఆ విధంగా పదవులు ఇవ్వలేదు. చంద్రబాబు ఏనాడైనా రాజ్యసభ సీట్లు బీసీలకు ఇచ్చారా?. గతంలో మీరు చెప్పుకున్న బీసీలు ఇవాళ సీఎం వైయ‌స్‌ జగన్ వెంట ఉన్నారు. వారు వైయస్సార్ సీపీని ఎందుకు ఆదరిస్తున్నారనేది చంద్రబాబు గుర్తించాలి. 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైయస్సార్ సీపీ విజయదుందుభి మోగించింది.ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ పాలన, ఆయన అమలు చేస్తున్న పథకాలు, ఆయన పరిపాలన విధానానికి ప్రజలు ఆ పట్టం గట్టారు.

అర్హత ఉన్న ఏ ఒక్క నిరుపేద ఏ ఒక్క పథకానికి దూరం కాకూడదన్న లక్ష్యంతో శాచురేషన్‌ విధానంలో అన్ని పథకాలు అమలు చేస్తున్నారు. ఇవన్నీ గుర్తించని చంద్రబాబు, తాను ముసలివాణ్ని కాదని, తనకు ఇంకా బలం ఉందని ఏదేదో మాట్లాడుతున్నాడు. ప్రతిపక్ష నేత తీరు ఆ విధంగా ఉంది.

తాను పక్కన కూర్చుని, పార్టీ నాయకులతో చంద్రబాబు ఇవాళ సీఎంని ఏ విధంగా తిట్టించారో ఇవాళ చూశాం. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ని సైకో అని తిట్టించాడు. మరి చంద్రబాబును ఏమనాలి?  కొజ్జాబాబు అనాలా?. ఒకవైపు వయసు మీద పడుతోంది. మరోవైపు కొడుకు అసమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడతున్నాడు. పార్టీ వారితో తిట్టిస్తున్నాడు. ప్రతిపక్షం అనేది బాధ్యతతో వ్యవహరించాలి. ఏ విమర్శ అయినా నిర్మాణాత్మకంగా ఉండాలి. మీ మంత్రులను అరెస్టు చేశామంటున్నారు. అచ్చెన్నాయుడు రూ.150 కోట్ల కుంభకోణంలో ఉన్నాడు. మరి ఆయనపై చర్యలు తీసుకోవద్దా? ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన విమర్శలను ఖండిస్తున్నాం.

గ్రామాల్లో మీకు వికాసం, మార్పులు కనిపించడం లేదా? ఇంగ్లిష్‌ మీడియమ్‌ స్కూళ్లు వద్దంటున్నారు. మరి మీ కుమారుడు, మనవడిని మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తారా?. రైతుల రుణాలు, మహిళల డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానన్న చంద్రబాబు మాట తప్పలేదా?. ఆనాడు నీవు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పెన్షన్లు 38 లక్షలు కాగా, ఇవాళ 62 లక్షల పెన్షన్లు ఇస్తున్నారు. నాడు పెన్షన్ల కింద నెలకు రూ.500 కోట్లు ఖర్చు పెడితే, ఇవాళ సీఎం వైయ‌స్ జగన్ ప్రభుత్వం చేస్తున్న వ్యయం రూ.1500 కోట్లు. అయినా సిగ్గు లేకుండా పెన్షన్‌ రాకపోతే, కోర్టుకు వెళ్లి పెన్షన్‌ ఇప్పిస్తానంటున్నాడు.

వయసులో ఎంత చిన్నవాడైనా సీఎం వైయ‌స్‌ జగన్‌, రాష్ట్రంలో కోట్లాది ప్రజల మనసు గెల్చాడు. ప్రేమను పొందాడు. అదే సిగ్గు లేని చంద్రబాబు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం అధ్యక్షుడిగా ఉండి, అదే కాంగ్రెస్‌తో జత కట్టాడు. ఏ ఎన్నికల్లోనూ ఒంటరిగా పోటీ చేయని చంద్రబాబు, తనది 40 ఏళ్ల రాజకీయ జీవితం అంటాడు. ఏమీ చేయకుండా, ఇవాళ మినీ మహానాడు పేరుతో మీటింగ్‌ పెట్టి, ప్రభుత్వంపైనా, ముఖ్య‌మంత్రిపైన‌ ఇష్టారాజ్యంగా విమర్శలు చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు తిట్టిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు గుర్తించాలి. తన వైఖరి మార్చుకోవాలి` అని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజమెత్తారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top