కేబుల్ కొనుగోలులోనూ అవినీతికి పాల్ప‌డ్డారు

ఫైబర్‌గ్రిడ్‌లో అవినీతిపై సీబీఐ విచారణ కోరుతున్నాం

పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి

విజయవాడ: గత ప్రభుత్వ హయాంలో ఫైబర్‌ గ్రిడ్‌లోనూ అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ విచారణ కోరుతున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్నారు. సెటాప్‌ బాక్సుల కొనుగోలులో అవినీతికి పాల్పడ్డారన్నారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో  రూ.2 వేలు విలువైన సెటాప్‌ బాక్స్‌ను రూ.4,400 పెట్టి కొనుగోలు చేశారని, 10 లక్షల బాక్సుల్లో రెండు లక్షల బాక్సులు పనిచేయడం లేదన్నారు. కేబుల్‌లో కూడా అవినీతి చేసి నాసిరకం కేబుల్‌ కొనుగోలు చేశారన్నారు. ఫైబర్‌ గ్రిడ్‌లో అవినీతిపై జరిగిన విచారణలో ఆధారాలన్నీ సేకరించి ఇచ్చామన్నారు. రాజధానిలో జరిగిన అవినీతిపై  సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబు, టీడీపీ నేతలను ప్రశ్నించారు. తప్పు లేకుంటే టీడీపీ నేతలు సీబీఐ విచారకు సిద్ధపడాలన్నారు.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top