విశాఖ రాజ‌ధాని కోసం ఐక్యంగా పోరాడుదాం

రేప‌టి విశాఖ గ‌ర్జ‌న కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాలి

రౌండ్ టేబుల్ స‌మావేశంలో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపు
 

శ్రీ‌కాకుళం  :  విశాఖ రాజ‌ధాని కోసం ఐక్యంగా పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపునిచ్చారు. శ్రీ‌కాకుళం జిల్లా కోర్టు ప‌రిధిలో శుక్ర‌వారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. 

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడి విశాఖే రాజ‌ధానిగా చేయాల‌ని, రేప‌టి వేళ నిర్వ‌హించే విశాఖ గ‌ర్జ‌న‌కు త‌ర‌లి రావాల‌ని కోరారు. నాకు రైతులంటే కోపం లేదు. రాజ‌ధానికి భూములు ఇచ్చిన రైతులంటే గౌర‌వం ఉంది. 

కానీ రైతుల‌ను అడ్డం పెట్టుకుని రియ‌ల్ ఎస్టేట్ మాఫియా నిర్వ‌హించ‌డం స‌బ‌బు కాదు. చంద్ర‌బాబు రైతుల‌ను అడ్డం పెట్టుకుని రియ‌ల్ ఎస్టేట్ మాఫియా న‌డుపుతున్నారు. ఇన్నాళ్లుగా మ‌నం సాధించుకోలేక‌పోయింది ఇప్పుడు సాధించుకోవాల్సిన త‌రుణం రానే వ‌చ్చింది. ఒక‌ప్పుడు రాజ‌ధానికి వెళ్లాలంటే వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించాల్సి వ‌చ్చేది. ఇప్పుడు మ‌న‌కు చేరువ‌లోనే రాజ‌ధాని ఏర్పాటు కానుంది. అంటే మ‌న‌కు విద్యా, ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాలు మెరుగు కానున్నాయి. క‌నుక ఈ విష‌య‌మై అంతా ఏక‌మై పోరాడాల్సి ఉంది.

గ‌తంలో న్యాయ‌వాద జేఏసీ అనేక విష‌యాలు ముందుకు వ‌చ్చి పోరాడిన దాఖ‌లాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ప‌రిపాల‌న సంబంధ వికేంద్రీక‌ర‌ణ‌కు సంబంధించి ముందుకు వ‌చ్చి మాట్లాడుతోంది. శుభ ప‌రిణామం. రాజ‌ధాని ఏర్పాటుకు సంబంధించి ఎప్పుడో శివ‌రామ‌కృష్ణన్ క‌మిటీ చెప్పింది. ఆ కమిటీ అన్న‌ది కేంద్రం నియమించింది. రాజ్యాంగ బ‌ద్దంగా ఏర్పాట‌యిన క‌మిటీ మాట‌లు అటుంచి అప్పట్లో చంద్ర‌బాబు నిర్ణ‌యాలు వెలువ‌రించారు. 
త‌న వారికి అనుగుణంగా రాజ‌కీయంగా ల‌బ్ధి పొందేందుకు వీలుగా త‌న సొంత మ‌నుషుల‌తో అప్ప‌టి మున్సిప‌ల్ శాఖ మంత్రి నారాయ‌ణతో కూడిన  క‌మిటీ వేశారు. త‌మ‌కు అనుగుణంగా త‌మ వారికి అనుగుణంగా అప్ప‌ట్లో నిర్ణ‌యాలు వెలువ‌రించారు. ఇప్పుడు మేం అధికారంలోకి వ‌చ్చాక మొత్తం అన్నింటినీ ప‌రిశీలించాక ఇక్క‌డ రాజ‌ధాని  నిర్మాణం ఆర్థికంగా కూడా భారం అని గుర్తించాం. అంతేకాదు శివ రామ కృష్ణ‌న్ చెప్పిన విధంగా ఒకే చోట రాజ‌ధాని అని కాకుండా ప‌రిపాల‌న వికేంద్రీక‌ర‌ణ‌కు స‌మ‌యాత్తం అవుతున్నాం. అందులో భాగంగా ప‌రిపాల‌న రాజ‌ధాని  గా విశాఖ‌ను చేయాల‌నుకుంటున్నాం. విశాల దృక్ప‌థంతో పాల‌న‌ను అందించాల‌న్న సంక‌ల్పంతో  ఈ నిర్ణ‌యం తీసుకున్నాం. 

పెద్ద క్యాపిటల్ అన్న కాన్సెప్టే ఈ రాష్ట్రానికి ప‌నికి రాదు అని శివ రామ‌కృష్ణ‌న్ క‌మిటీ చెప్పింది. ఆ రోజు నివేదిక అనుసారం సెక్ష‌న్ 6లో భాగంగా ప్ర‌స్తావించిన విష‌యాలు ఎక్క‌డా అమ‌లు చేయ‌లేదు. హ్యూజ్ క్యాపిటల్ కు స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్ ఏ విధంగా అనుకూలి స్తుంద‌ని, అందుకు ఐదు ల‌క్ష‌ల కోట్లు, నాలుగు ల‌క్ష‌ల కోట్లు వెచ్చించడం అంటే అది స‌బ‌బు కాదు. 

పూర్వం ఇలానే మ‌నం ఒకే ప్రాంతంలో రాజ‌ధానిని అభివృద్ధి చేశాం. ఓ యాభై ఏళ్ల త‌రువాత ఆ రాజ‌ధాని వ‌దిలి రావాల్సి వ‌చ్చింది. అయినా మీకు తెలియ‌దా.. మీ అనుభ‌వం ఇదే చెబుతుందా ? ఆ రోజు దొన కొండ అని నూజివీడు అని, మొదట్లో చెప్పారు. త‌రువాత మీరు ఇంట‌ర్న‌ల్ గా ఓ మోడ‌ల్ తీసుకుని అందుకు అనుగుణంగా రియ‌ల్ ఎస్టేట్ వ‌ర్గాల‌కు అనుగుణంగా  చేశారు. కానీ దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నం పొందింది ఎవ‌రు. ఆ రోజు జీ టు జీ అని  ఓ ఒప్పందం జ‌రిగింద‌ని చెప్పార‌ని , కానీ సింగ‌పూర్ ప్ర‌భుత్వ మంత్రి ఇవేవీ నిజం కాదు అని, త‌ప్పు అని,ఓ ముఖ్య‌మంత్రి చెప్పిన విధంగా అవ‌న్నీ త‌ప్పు అని తేల్చార‌ని, ఆ విధంగా సింగ‌పూర్ మంత్రి ఈశ్వ‌ర‌న్ నాటి ప్ర‌భుత్వ పెద్ద చెప్పిన మాట‌లు తోసి పుచ్చారు అని విన్న‌విస్తున్నాను. రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాట‌వుతున్న అమ‌రావ‌తిని ఏ విధంగా అంగీక‌రించాలి. ఎందుక‌ని మూడు రాజ‌ధానులు ఉండ‌కూడ‌దు.  ఆ విధంగా ఎందుక‌ని ఆలోచించ‌కూడ‌దు. అందుకే ఎవ‌రిది ద్రోహం.. ఎవ‌రిది రాజ్యాంగ విరుద్ధం అన్న‌వి ఆలోచించాం. ఒక శాస‌న స‌భ‌కు రాజ‌ధాని విష‌య‌మై నిర్ణ‌యం తీసుకునే అధికారం లేదు అని హై కోర్టు అంటోంది. రాష్ట్రాల‌కు లేక‌పోతే ఎవ‌రికి ఉంటుంది కేంద్రానికి ఉంటుంది. కేంద్రం నియ‌మించిన క‌మిటీకి ఉంటుంది. కేంద్రం తీసుకువ‌చ్చిన విభ‌జ‌న చ‌ట్టం. ఆ చ‌ట్టం ప్ర‌కారం అమ‌లు చేయాల్సి న బాధ్య‌త ఎవ‌రిది రాష్ట్రానిదే క‌దా ! క‌నుక డిఫ‌రెంట్ ఆల్ట‌ర్ నేటివ్స్ లేవు. క‌నుక వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం శివ రామ‌కృష్ణ‌న్ క‌మిటీ ఇచ్చిన నివేదిక‌ను ఇగ్నోర్ చేయ‌డానికి అవ‌కాశ‌మే లేదు. ఈ ప్ర‌జ‌ల త‌ర‌ఫున ఉన్న ప్ర‌భుత్వం మోస‌పూరిత నిర్ణ‌యాల‌ను అంగీక‌రించ‌డ‌మా లేదా ఇవి త‌ప్పు అని చెప్ప‌డ‌మా ? ఎవ‌రు ఎటువైపు ఉండాలి. మ‌న పూర్వీకులు త‌ప్పు చేశారు అని, మ‌నం త‌ప్పు చేస్తామా .. నన్ను దృష్టిలో ఉంచుకుని మాట‌లు అన‌వ‌చ్చు కానీ రాజ‌ధాని విష‌య‌మై రాజ్యాంగం చెబుతున్న‌ది.. కేంద్ర క‌మిటీ చెబుతున్న‌ది అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ఎవ‌రిది ప్ర‌భుత్వానిది కాదా .. క‌నుక మేం మూడు రాజ‌ధానుల ఏర్పాటు నిర్ణ‌యంపైనే క‌ట్టుబ‌డి ఉన్నాం అని వివ‌రించారు.

జిల్లా బాలాసోసేషన్ అధ్యక్షులు బి పాల్గొనరావు, రాష్ట్ర బార్ కౌన్సిల్ నెంబర్ గేదెల వాసుదేవరావు, జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ లీగల్ సెల్ నాయకులు ఎమ్మెస్ వినయ్ భూషణ్ రావు, సీనియర్ న్యాయవాదులు తర్ల డ రాధాకృష్ణ, వై మురళీమోహన్, సిమ్మ రాజశేఖర్, పొన్నాడ రిషి,  వాన కృష్ణచంద్, టి.బాలకృష్ణ, సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు

Back to Top