కులగణాలకు సహకరించండి

 ప్రజలకు మంత్రి ధర్మాన ప్ర‌సాద‌రావు సందేశం

శ్రీకాకుళం : కులగణాలకు సహకరించాలి అని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. శుక్రవారం ఉదయం కులగణన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ..ప్రజల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు,  పథకాల అమలు కోసం జనాభా ప్రాతిపదిక అవసరమైనటువంటి బడ్జెట్ కేటాయింపు, విధాన నిర్ణయాలు అమలు చేయడానికి సామాజిక ఆర్ధిక పరిస్థితులు, అలాగే కులాలు వారీగా ఎంతెంత శాతం ఉన్నారు అన్న వివరాలు ఈ కులగణన ద్వారా తెలుస్తాయన్నారు. ప్రభుత్వాలు ఆయా కులాల సామాజిక ప్రజలకు అవసరమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలను కులాల సహాయ సామాజిక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు చేయడంలో ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, జనాభా ప్రాతిపదికన ఆయా కులాలకు నిధులు కేటాయించు నిమిత్తం ప్రభుత్వానికి ఈ గణన ఉపయోగపడుతుందన్నారు.

ఈరోజు నుండి పది రోజులు పాటు మొత్తం  రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయ సిబ్బంది, వాలంటరీ వ్యవస్థ కుటుంబ వివరాలను  సేకరించడానికి ఇంటిటింటికి రావడం జరుగుతుందని,  కుల గణన సకాలంలో జరిగేలా సిబ్బందికి ప్రజలు సహకరించాలని హితావు పలికారు.

Back to Top