శ్రీకాకుళం: ఎవరి ప్రమేయం..ఎవరిప్రోద్బలం లేకుండా..అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. జీవన ప్రమాణాల పెరుగుదలకూ, మెరుగుదలకూ ఉద్దేశించి చేస్తున్న పథకాల నిర్వహణను అర్థం చేసుకుని, వాటితో ముడిపడి ఉన్న ఆర్థిక ప్రయోజనాలు కన్నా సామాజిక ప్రయోజనాలను గుర్తించాలన్నారు. ఇదీ టీడీపీకీ, వైయస్ఆర్ కాంగ్రెస్ హయాంలో నడుస్తున్న ప్రభుత్వానికీ ఉన్న తేడా.. దీనిని మీరు గుర్తించాలన్నారు. రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు నేతృత్వాన పెద్దపాడు - 1 సచివాలయం పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎన్నికల ముందు ఆ రోజు విపక్ష నేత హోదాల ఊరూ ఊరూ తిరిగి ప్రజల కష్ట నష్టాలు గుర్తించి పాదయాత్రలో చెప్పినవి అన్నీ చేసిన ఏకైక నాయకులు వైయస్ జగన్ . ఇవాళ నాలుగున్నరేళ్ల పాలన అనంతరం ప్రతి ఇంటికీ వెళ్ళి ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి అని మాలాంటి నాయకులకు సీఎం వైయస్ జగన్ ఆదేశించారు. అందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం..నిర్వహిస్తున్నాం. 2014 ఎన్నికల వేళ తమకు ఓటు వేస్తే ఇవి చేస్తాం అవి చేస్తే అని చెప్పి చంద్రబాబు నాయుడు మోసం చేశారు. రైతులనూ.. మహిళా సంఘాలనూ ఇంకా చెప్పాలం టే అన్ని వర్గాలనూ..అన్ని ప్రాంతాల వారినీ..అందరినీ..మోసం చేసిన ఘనుడు..ఆయన. ఒకరేమో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉం డే నాయకుడు..ఇంకొకరు అబద్ధాలు చెప్పి మోసం చేసే నాయకుడు. ఈ ఇద్దరిలో ఎవరు మాటకు విలువ ఇస్తారో.. ఎవరు ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేస్తారో మీకే తెలుసు. స్కూల్ పిల్లల విషయంలో పెద్ద ఎత్తున ఎందుకు ఖర్చు చేస్తున్నారు అని అందరూ అంటున్నారు.. ఇది తగదు. కొందరి పేదరికం వారి పిల్లల చదువుకు అడ్డంకాకూడదని..భావించి మేం ఖర్చు చేస్తున్నాం. ఏ కారణంతోనూ చదువు అర్ధంతరంగా ఆగిపోకూడద ని భావించి,రకరకాలుగా వారికి ప్రోత్సాహం అందిస్తున్నాం. నిజానికి ఇదంతా చేస్తున్నది గొప్ప దృక్పథంతో కానీ దీనిని విపక్ష శ్రే ణులకు చెందిన వారెవ్వరూ అర్థం చేసుకోవడం లేదు. వాస్తవానికి వారు ఓటు వేస్తారని కాదు..పేద,ధనిక వర్గాలు అంతరాలు త గ్గాలని చేస్తున్న ప్రయత్నం. ఇది నిజాయితీ కలిగిన నాయకులు వైయస్ జగన్ ఒక్కరి వల్లనే సాధ్యం అని మీకు విన్నవిస్తూ ఉన్నాను. అధికారం అందుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ మేం కులం చూడడం లేదు,మతం చూడడం లేదు,కేవలం పేదరికం,కన్నీరు చూస్తు న్నాం. వాటిని అర్థం చేసుకుని సంబంధిత వర్గాల జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తూ ఉన్నాం. గతంలో పెద్దపాడు లో 1200 ఇళ్లు ఇచ్చాము..2014 కి ముందు..అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. గ్రామంలో ఉండే చెరువుకు వచ్చే వేసవికి వంశధార నీరు అందిస్తాం. పేదలందరి సొంతింటి కలనూ నెరవేరుస్తున్నాం. అవి ఇళ్లు కాదు ఊళ్లు. జగనన్న కట్టించి ఇస్తున్న ఊళ్లు. 24 కోట్ల రూపాయలతో పెద్దపాడుకు తాగునీరు అందిస్తాం..పనులు ప్రారంభిస్తాం. రానున్న కాలాన 30 రకాల పనులు పెద్దపాడు లో పూర్తి చేస్తాం..అందులో చాపురం నుంచి వానవానిపేట వరకూ రూ.1.5 కోట్లతో రోడ్లు వేయనున్నాం. ఎలక్ట్రికల్ లైన్స్ కు రూ.10 లక్షలు వెచ్చించనున్నాం. తంగివానిపేటలో 40 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు వేయనున్నాం. ఇలా అన్ని పనులూ గ్రామంలో నూ,పరిసర గ్రామాల్లోనూ పూర్తి చేస్తాం.. అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు. మున్సిపల్ చైర్మన్ చల్లా ఓబులేసు అధ్యక్షతన జరిగిన సభలో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాసరావు రావు, పట్టణ వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు సాదు వైకుంఠ రావు, పట్టణ వైయస్ఆర్‌సీపీ క్లస్టర్ 1 అధ్యక్షులు చౌదరి సతీష్, వైయస్ఆర్‌సీపీ నాయకులు రఫీ, గేంజి వాసు, రుప్ప గిరి, పెద్దపాడు వైయస్ఆర్‌సీపీ నాయకులు బాగు దశరథ, నక్క దేవ నంద్, గర్రు రవి కుమార్, కలగ వేంకట బాబు, పాలిన జగణధం, ఈశ్వర్ రావు, బొట్ట సిందు యాదవ్, బొట్ట పాపి, తంగి అప్పన స్వామి, బుర్ల ఉమా మహేశ్వర రావు, నాయుడు తదితరులు పాల్గొన్నారు.