విభిన్న పాల‌న మా సొంతం

గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మన ప్రభుత్వంలో మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు

రూ. 15 లక్షలతో నిర్మించిన సచివాలయ అదనపు భవనం ప్రారంభం

శ్రీ‌కాకుళం: విభిన్న పాల‌న అందించ‌డం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం సొంతమ‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు  నేతృత్వాన శ్రీ‌కాకుళం రూర‌ల్ మండ‌లం,క‌ళ్లేప‌ల్లి గ్రామంలో గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్రమాన్ని నిర్వ‌హించారు. గ‌తంలో నెల‌కొన్న విధంగా ఇవాళ అవినీతికి తావు లేని పాల‌న అందించేందుకు కృషి చేస్తున్నామ‌ని, పాల‌న సంబంధ సంస్క‌ర‌ణ‌ల్లో ప్ర‌ధానమ‌యిన ఈ మార్పును ప్ర‌తి ఒక్క‌రూ గుర్తించాల‌ని మంత్రి విన్న‌వించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. రూ.2.70 కోట్లతో ఆస్ప‌త్రి నిర్మాణానికి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇప్ప‌టిదాకా ఈ పంచాయ‌తీకి ప‌ది కోట్ల రూపాయ‌ల‌కు పైగా నిధులు కేటాయించామ‌ని తెలిపారు. గ్రామ స‌చివాల‌య ప‌రిధిలో ఇప్ప‌టికే కేటాయించిన నిధుల‌తో ప్రాధాన్య రీత్యా ప‌నులు చేప‌ట్టేందుకు స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు కృషి చేయాల‌ని కోరారు. 

 పార్టీ పట్ల,మా పట్ల ఉన్న న‌మ్మ‌కంతో,చిత్తశుద్ధితో మీ అందరూ ఈ  కార్యక్రమంలో భాగ‌స్వాముల‌య్యారు. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. మూడున్న‌రేళ్ల‌లో చేప‌ట్టిన ప‌నులు, వాటి తీరు తెన్నులు, అమలుకు నోచుకున్న హామీలూ వాటి తీరు తెన్నులు తెలుసుకునేందుకే మేం ఇక్క‌డికి వ‌చ్చాం. ఇటీవ‌ల నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. కొన్ని రాజ‌కీయ పార్టీలు బాదుడే బాదుడు అని రోడ్డెక్కుతున్నాయి. ధ‌ర‌ల విష‌య‌మై నేను ఇప్ప‌టికే ఓ విజ్ఞ‌పన చేసి ఉన్నాను. ద‌య‌చేసి పక్క రాష్ట్రాలతో ఒకసారి పొలిచి చూడండి. 

అప్ప‌టికీ ఇప్ప‌టికే ఎంతో తేడా 
అవినీతి లేని పాల‌న‌కు ఇదే తార్కాణం 
సమాజంలో గౌరవం లేదని ఇన్ని సంవత్సరాలు ఉన్న కుటుంబాలకు గౌరవం ఇస్తున్నాం. విద్య, వైద్యం రంగాల‌కు సంబంధించి ప‌నులు కానీ,లేదా సంబంధిత ల‌బ్ధిదారుల ఎంపిక‌ల్లో కానీ, గృహ నిర్మాణాలకు సంబంధించి ల‌బ్ధిదారుల ఎంపిక‌లో కానీ ఆ రోజు చంద్రబాబు హయాం అంతా బ్రోకర్లు మయంగా ఉండేది. కానీ ఇప్పుడు ప‌ద్ధతి మారింది. ప‌నులు కేటాయించే తీరే మారిపోయింది. ప‌థ‌కాలు అమ‌లు చేసే వైనం దేశానికే ఆద‌ర్శ‌నీయం అయి ఉంది. వైస్సార్సీపీ హయాంలో ఒక్కరైనా లంచం అడిగారని చూపించగలరా ? 75 ఏళ్ల స్వాతంత్ర్యంలో ఇలాంటి పాలన ఎవరైనా అందించారా ? 

అభివృద్ధి లేదు అని చెప్ప‌డం అబ‌ద్ధం 
విప‌క్ష పార్టీలు కొన్ని అదే ప‌నిగా అభివృద్ధి లేదని అంటున్నాయి. మీ ఊరిలోని స్కూల్ ఒక్క‌సారి చూడండి. అక్కడ పిల్లలకు అందిస్తున్న సౌక‌ర్యాలు, అదేవిధంగా వారి త‌ల్లుల‌కు అందిస్తున్న ఆర్థిక ప్ర‌యోజ‌నాలు ఒక్క‌సారి చూడండి. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కం అమ‌లు అవుతున్న తీరును ప‌రిశీలించండి. పోష‌కాహారం అందించ‌డ‌మే ప్ర‌థ‌మ ప్రాధాన్యంగా అమలు చేస్తున్న జ‌గ‌న‌న్న గోరు ముద్ద ప‌థ‌కం అమ‌లును ప‌రిశీలించండి. పరిపాలనలో మార్పులు తీసుకు వచ్చాం. అందుకోసమే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, ఆర్బికే, వెల్నెస్ సెంటర్లు నెలకొల్పాం. అన్నింటికి ఒక అధికారిని అందుబాటులో పెట్టాం. వ‌లంటీర్ వ్యవస్థ ద్వారా పాలన మీ ఇంటి వద్దకే సంక్షేమ ప‌థ‌కాలు తీసువస్తున్నాం.

 ఏది మంచో  ? ఏది చెడో ? ఆలోచించుకోండి 
ధాన్యం ధరలు నిర్ణయం చేసేది కేంద్ర ప్రభుత్వం. వారికి గిట్టుబాటు ధర లేదు. అందుకోసమే సీఎం జగన్ పెట్టుబడి సహాయం ఇస్తూ అండగా ఉన్నారు. మన తర్వాత తరం జీవనంలో మార్పులు తీసుకు రావడమే ప్రభుత్వ పాలనకు ఉన్న ప్ర‌ధాన ధ్యేయం. ఈ సంక్షేమ పథకాలు అందకపోతే జీవ‌న ప్ర‌మాణాలు మారుతాయా ? మార‌వు క‌దా ! ఒక్క‌సారి మీరే ఆలోచించండి. ఏది మంచో ? ఏది చెడో? 

భూముల రీ స‌ర్వేతో ఎంతో మేలు 
సుమారు 100 ఏళ్ల ముందు బ్రిటిష్ వారు చేసిన సర్వే ని మళ్ళీ ఇప్పుడు చేస్తున్నాం. గ్రామాల్లో తగాయిదాలు లేకుండా చూస్తాం. సచివాలయంలోనే రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నాం. ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి పని లేకుండా సచివాలయంలోనే ఇంకా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌ను తీసుకు వస్తాం. కొత్త పద్ధతులు తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ప్రజలకు మంచి చేయాలన్న భావ‌న‌లో భాగంగా మహిళకు ఇంట్లో, సమాజంలో గౌరవం పెంచే విధంగా సంక్షేమ ప‌థ‌కాల అమలులో వారికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. చంద్రబాబు హైదరాబాద్లో ఉంటూ ఆంధ్రప్రదేశ్ కోసం మాట్లాడం కాదు. ఇంకో రాష్ట్రంలో ఉంటూ మన రాష్ట్రం కోసం మాట్లాడ‌డం అన్న‌దే విడ్డూరం. చంద్రబాబు జూమ్ లో కనిపిస్తారు. కానీ జనాల్లో క‌నిపించేదే తక్కువ. ఇక ఏనాటి నుంచో ఇక్క‌డి ప్ర‌జ‌ల క‌ల అయిన వంశ‌ధార నీళ్ల‌ను అందిస్తాను. వంశధార ఫేజ్ 2 పూర్తి అయితే మండు వేసవిలో అందిస్తాం.

నేను అవినీతి చేశాన‌ని నిరూపించ‌గ‌ల‌రా ? 
నేను గట్టిగా మాట్లాడితే ఈనాడులో రాస్తారు. నా 40 ఏళ్ల రాజ‌కీయ ప్రయాణంలో నేను సెంటు భూమిని లంచంగా తీసుకున్నాను అని నిరూపించగలరా ? పచ్చళ్ళు అమ్ముకునే రామోజీ కి ఇన్ని వేల ఎకరాలు ఎక్కడివి..? చంద్రబాబుకి ఇంతా ఆస్తి ఎక్కడ నుంచి వచ్చింది. నాకు ఓటు వేసి గెలిపించిన ప్రజలకు ఏ రోజూ చెడ్డ పేరు తీసుకు రాను.

మేలు చేసే సంస్క‌ర‌ణ‌లను స్వాగ‌తిద్దాం.. అమ‌లు క‌ఠినంగా ఉన్నా స‌రే.
సంస్కరణలు చేసే వాళ్ళు కఠినంగా ఉంటారు. వాటి ఫలితాలు అందిన్న రోజే ఆ కఠినత్వం విలువ తెలుస్తుంది. సీఎం జగన్ కఠినంగా ఉంటున్నారు అంటే వ్యవస్థలో మార్పు తీసుకు రావడానికే, ప్రజల జీవ‌న ప్రమాణాలు పెంచుతున్నారు సీఎం జగన్. అందుకు అనుగుణంగా గ్రామాల్లో ప్ర‌జ‌లు మ‌రింత చైత‌న్య‌వంతులు అవుతున్నారు. సచివాలయం ఉద్యోగులు గౌరవంగా బ్రతకడం అలవాటు చేసుకోవాలని మంత్రి ధర్మాన పేర్కొన్నారు..

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు మాట్లాడుతూ, పేద ప్రజలు అందరూ వైస్సార్సీపీ ప్రభుత్వంకి అండగా ఉండాలి. ప్రతిపక్షాలు చేస్తున్న అర్థం లేని ఆరోపణలు తెప్పికొట్టాలి. గతంలో ఏ ప్రభుత్వం చేయన్నని మంచి పనులు వైస్సార్సీపీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు.

కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, ఎంపిపి అంబటి నిర్మల శ్రీనివాసరావు, జెడ్పిటిసి రుప్పా దివ్య, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, సర్పంచ్ గంగు నాగరత్నం, అంబటి శ్రీనివాసరావు, చిట్టి జనార్ధనరావు, చల్లా రవి కుమార్, ముకళ్ల సుగుణ, గంగు నరేంద్ర, చల్లా రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 

 

తాజా వీడియోలు

Back to Top