యుగయుగాల నాటి కల సాకారం

వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజ్యాధికారం

వెనుకబడిన వర్గాలకు జరుగుతున్న మేలును ప్రజలకు వివరిస్తాం

26న శ్రీకాకుళం నుంచి బస్సుయాత్ర.. 29న అనంతలో ముగింపు

నాలుగు రోజులు.. నాలుగు చోట్ల సుదీర్ఘమైన బహిరంగ సభ

బస్సుయాత్ర వివరాలు మీడియాకు వివరించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు

తాడేపల్లి: బలహీనవర్గాలకు రాజ్యాధికారం దిశగా ప్రభుత్వ అడుగుపడిందని,  స్వాతంత్య్రం వచ్చాక ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలోని బ్యాక్‌వర్డ్‌ క్లాసులను బ్యాక్‌ బోన్‌ క్లాసులుగా నిలబెడుతున్న ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కే దక్కుతుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీలకు జరుగుతున్న మేలును ప్రజలకు వివరించే బాధ్యతతో బస్సుయాత్రను చేపడుతున్నామని చెప్పారు. బస్సుయాత్ర ఈనెల 26న  శ్రీకాకుళంలో ప్రారంభమై.. 29న అనంతపురంలో ముగుస్తుందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మేరుగ నాగార్జున, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా బస్సు యాత్రకు సంబంధించిన వివరాలను మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాకు వివరించారు. యాత్రలో ఒకరోజు ఒక చోట సుదీర్ఘమైన బహిరంగ నిర్వహిస్తాం. ప్రభుత్వ భావజాలం, ప్రభుత్వం చేసిన సంస్కరణలు వల్ల సమాజంలో వచ్చిన మార్పులు, ఏ దిశవైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎదుగుతున్నాయనే విషయాన్ని సుదీర్ఘంగా బహిరంగ సభలో చెప్పడం జరుగుతుంది.

ఎవరెవరు పాల్గొంటారంటే..
ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వర్గాల నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్నారో.. తన వర్గాల కోసం అనేక పథకాలను రూపొందించి అమలు చేస్తున్నారో.. మంత్రివర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సభ్యులు బస్సు యాత్రలో పాల్గొంటారు. 26వ తేదీన శ్రీకాకుళంలో యాత్ర ప్రారంభమై.. విజయనగరంలో సాయంత్రం బహిరంగ సభ జరగబోతుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, కార్పొరేషన్‌ చైర్మన్, మండల, జిల్లా పరిషత్‌ ప్రెసిడెంట్స్‌ అందరూ పాల్గొంటారు. మంత్రివర్గ సభ్యులు నాలుగు రోజులు, నాలుగు ప్రాంతాల్లో పాల్గొంటారు. 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు జరిగిన మేలిది..
గతంలో ఎక్కడో ఒక బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి వస్తే గొప్ప. కానీ, నేడు మంత్రివర్గంలో 77 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఉన్నారు. ఇది దేశంలోని మరో రాష్ట్రంలో ఎక్కడైనా చూపించగలరా..? నలుగురు రాజ్యసభ సభ్యులు బీసీ వర్గానికి చెందినవారు ఉన్నారు. తెలంగాణ బీసీకి ఇస్తే తప్పా.. చంద్రబాబు నివాసం ఉండేది ఎక్కడ..? ఏ రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు..? హైదరాబాద్‌లో నివాసం ఉండొచ్చు.. దేశ వ్యాప్తంగా బీసీల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తికి రాజ్యసభకు అవకాశం కల్పిస్తే తప్పుగా మాట్లాడుతారా..? ఎక్కడున్నాడనేది కాదు.. ఆ వర్గాల తాలూక ఘోషను వినిపించే వ్యక్తిని ఎంచుకొని రాజ్యసభలో మాట్లాడించే ప్రయత్నాన్ని ఎందుకు హర్షించలేకపోతున్నారు. 

దళిత మహిళా హోంమంత్రిని గతంలో చూశామా..?
ఎస్సీ వర్గానికి చెందిన మేకతోటి సుచరిత హోంమంత్రిగా మూడు సంవత్సరాలు కొనసాగారు. ఇలాంటి పదవులు గతంలో ఎలా ఉండేవి..? ఇలాంటి పదవులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అర్హత లేదనే భావన ఈ సమాజంలో ఉండేది. నేడు.. మరో దళిత మహిళ తానేటి వనితను హోంమంత్రిగా ఉన్నారు. 

చంద్రబాబు దేన్ని హర్షించగలరు..?
డైరెక్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ ద్వారా ఇస్తున్న నిధులు సుమారు 80 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వెళ్తుంది. వెనుకబడిన వర్గాలకు రాజ్యాధికారం కల్పించే విప్లవాత్మక మార్పులను కూడా చంద్రబాబు హర్షించలేకపోతే.. మరి దేన్ని హర్షించగలరు..? కొంతమంది ముఖ్యమంత్రి పదవి బీసీలకు ఇచ్చేస్తారా అని మాట్లాడుతున్నారు.. చంద్రబాబు ఇచ్చారా..? కనీసం రాజ్యసభ సీటు అయినా బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌కు ఇచ్చారా..?’ అని ప్రశ్నించారు. 

 

Back to Top