శ్రీకాకుళం: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అందరి సంక్షేమం కోరే ప్రభుత్వమని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. మంగళవారం పెద్దపాడు క్యాంపు కార్యాలయం వద్ద గార మండలం, బందరువానిపేటలో రామ మందిరం నిర్మాణానికి టీటీడీ బోర్డ్ (శ్రీవాణి ట్రస్ట్ ) నుంచి పది లక్షల రూపాయల చెక్కును మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ..ఇవాళ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పంచేస్తున్నాడు పంచేస్తున్నాడు అని విపక్షాలు సత్య దూరం అయిన ప్రచారాలు మానుకోవాలి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ప్రమాద వశాత్తూ మరణిస్తే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు అందిస్తున్నారు. అలానే జీవన ప్రమాణాల మెరుగుదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన మాటలు నిలుపుకున్న దాఖలాలు లేవు. అమలు కాని మ్యానిఫెస్టోను ఇవాళ టీడీపీ నాయకులు చెబుతున్నారు. ఒక ఇంట్లో చదువుకునే విద్యార్థి ఒక్కరుంటే పదిహేను వేలు, ముగ్గురుంటే 45 వేలు ఇస్తామని చెబుతున్నారు. కానీ అవేవీ అమలు కావు. ఇవ్వరు కనుకనే ప్రజలను నమ్మబలికి నట్టేట ముంచే ప్రయత్నం ఒకటి చేస్తూ ఉన్నారు. మీరు ఆ మాటలను నమ్మకండి. విపక్ష శ్రేణుల హామీలు అమలుకు నోచుకోవు. గతంలోనూ ఇదే నిరూపణ అయింది. ఇదే వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన మాదిరి ఇవ్వలేరు అని చెప్పిన నువ్వు ఎలా ఇస్తావో చెప్పగలవా ? (చంద్రబాబును ఉద్దేశించి). ఇది అమాయకులను మోసగించే పని తప్ప మరొకటి కాదు. ఇవన్నీ చైతన్యవంతులయిన మీరు చెప్పాలి. ఇవన్నీ మత్స్యకార గ్రామాల ప్రజలు నమ్మేస్తారు. బందరువానిపేటలో 1100 ఇళ్లు ఇచ్చాం. అన్ని గ్రామాలకూ రహదారులు వేశాం. మత్స్యకార గ్రామాలలో పెద్ద మార్పు వచ్చింది. డ్రింకింగ్ వాటర్ అందించాం. సైక్లోన్ షెల్టర్ జోన్స్ ను ఏర్పాటు చేశాం. కొమర వానిపేట రోడ్డు పూర్తి చేశాం. బీదల పక్షాన నిలిచే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. లాస్ట్ టైం కూడా మీరు మద్దతు ఇచ్చారు. ఈ సారి కూడా మీరు సపోర్టు చేయాలని కోరుకుంటున్నాను. మూల పేట పోర్టు పనులు చేయిస్తున్నాం. దీంతో ప్రపంచంతో మనకు కనెక్టివిటీ పెరుగుతుంది. మన గ్రామాల నుంచి షిప్పులలో పనిచేస్తున్న పిల్లలు వాళ్ల కంపెనీ షిప్ మూలపేటకు వస్తే ఇక్కడే దిగిపోవచ్చు. శరవేగంతో పనులు జరుగుతున్నాయి. ఇలాంటివి ఎప్పుడయినా ఊహించామా.. ఇంకొక్క ఎనిమిది, తొమ్మిది మాసాలలో బుడగట్ల పాలెం ఫిషింగ్ హార్బర్ పనులు పూర్తి కానున్నాయి. అప్పుడు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పని లేదు. ఫిషింగ్ హార్బరు వస్తే వేలాది బోట్లు ఇక్కడికి వస్తాయి. మీలో కొందరికి బ్యాంకు రుణాలు ఇప్పించి బోట్లు కొనుగోలు చేసేలా చేస్తాం. ఫిషింగ్ హార్బర్ పనుల కోసం 380 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నాం. ప్రస్తుతం అక్కడ పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ ఎలా జరిగాయి. మీరు ఎంచుకున్న ప్రభుత్వాల వల్ల వస్తున్నాయి. పద్నాగేళ్లు అధికారంలో ఉన్న నువ్వు ఏం చేశావు ( చంద్రబాబును ఉద్దేశించి). ఆయనేమో తెలిసీ తెలియని మాటలు చెబుతున్నారు. (చంద్రబాబు కొడుకు లోకేశ్ ను ఉద్దేశించి). ఎవరో రాసి ఇస్తే చదివేస్తున్నారు. ఆయనకు ఏమీ తెలియదు. హాస్పిటల్ (రిమ్స్), యూనివర్శిటీ (బీఆర్ ఏయూ) మేమే తీసుకుని వచ్చాం, బ్రిడ్జిలు మేమే కట్టాం. పోర్టు, హార్బరు కట్టాం. పలాస కేంద్రంగా కిడ్నీ వ్యాధులకు సంబంధించి రీసెర్చ్ సెంటర్ కట్టాం. అలానే అక్కడ సర్ఫేస్ వాటర్ మేమే అందించాం. అందుకు ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించాం. లోకేశ్ ! నువ్వు ఒక్కటి చెప్పు. ఫలానాది ఈ జిల్లాకు చేశానని. నీ పద్నాగేళ్ల పాలనలో ఏం చేశావో చెప్పు .. (చంద్రబాబును ఉద్దేశిస్తూ) పాపం ఆయనకు తెలియదు కనుక మాట్లాడి వెళ్లిపోయారని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.