శ్రీకాకుళం: ఇచ్చిన మాట నెరవేర్చాం అని, నాలుగు విడతల్లో ఆసరా పథకం కింద డ్వాక్రా రుణాలు తీర్చాం అని,. తద్వారా స్త్రీలకు ఆర్థిక స్వావలంబన కల్పించామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. వైయస్ఆర్ ఆసరా పథకం నాలుగో విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ..విపక్ష నేతల మాటలను మీరు నమ్ముకుంటే మీకు బోడిగుండే మిగులుతుందని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకుని పాలించేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల ముందు చెప్పినవి చెప్పినట్టుగా చేసిన పార్టీ వైయస్ఆర్‌సీపీ . నాలుగు విడతల్లో మహిళా సంఘాలకు తీరుస్తాం అని చెప్పాం. నాలుగో విడత ఇప్పుడు తీర్చేశాం. బ్యాంకులకు బకాయిలు లేవు ఈరోజు. అధికారం కోసం అబద్ధాలు చెప్పి తీర ఆ అధికారం పొందాక చెప్పినవి పక్కన పెట్టి,మొక్కు బడిగా ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ ఇస్తే,మహిళలు అది గ్రహించి చంద్రబాబు కి దెబ్బ కొట్టారు. మాట మీద నిలబడే వ్యక్తి సీఎం వై.యస్.జగన్, మాట నిలబెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు అని అందరికీ తెలిసి వచ్చింది. 2019 లో ఓటు వేసి ఎన్నుకున్న ఈ ప్రభుత్వం గడువు పూర్తి కావస్తోంది. గత ప్రభుత్వం పాలన , వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం పాలన చూసాక ప్రజలకే అర్థం అవుతోంది ఎవరికి తాళం ఇవ్వాలి అని.. చంద్రబాబు 2014 లో తాళం ఇస్తే పెట్టెలో డబ్బులు తీశారు కానీ, ప్రజల కోసం కాదు. ప్రజాస్వామ్యం లో ప్రజల నిర్ణయం మీదనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. నాటి ప్రభుత్వాన మోసం చేసిన చంద్రబాబు ఒక పక్క,ఊళ్ళలో ప్రజల ధనం దోచుకునేందుకు బ్రోకర్స్ మరో పక్క ఉండేవారు. కానీ ఇవాళ మాట నిలబెట్టి,కుటుంబాల్లో ఉండే ప్రతి ఒక్కరికీ ఏదో ఒక రూపేణా ప్రభుత్వం సాయం గా ఉంది, ఆకలి తీర్చి,కన్నీరు తుడిచి గౌరవం పెంచి పని చేసి సీఎం వైయస్ జగన్ ఈ ఇద్దరిలో ఎవరికి మద్దతు తెలుపుతారు..ఇన్ని మోసాలు చేసిన చంద్రబాబు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మళ్ళీ మోసం చేసేందుకు దొంగ మానిఫెస్టో వస్తారు. ఇందులో భాగంగా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని చెపుతున్నారు.. అవి నమ్మితే మీకు బోడిగుండు మిగులుతుంది. మీరు ఓటు వేస్తారో లేదో చూడలేదు. ఇంటి మీద జెండా కడతారా అని చూడలేదు. కులం చూడలేదు. కేవలం అర్హత ఉంటే చాలు పథకాలు వర్తింపజేశాం. ఇదీ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఘనత. అంతేకాదు ఏ పథకం కోసం కూడా ఎవ్వరూ లంచం ఇచ్చింది లేదు. ఎవ్వరూ తీసుకున్నది లేదు. పథకాల అమలు లో మేము ఎవ్వరూ ఏ పార్టీ అని చూడలేదు. మోసం చేసే వాళ్ళు ఎవ్వరో ? ప్రజల స్థితి గతులు పెంచేందుకు ఎవరు కృషి చేశారో ? గమనించాలి. సీఎం జగన్ పేదలకు పంచి పెడుతున్నారు అంటున్నారు కానీ, దోచేస్తునారు అని ఎవ్వరూ చెప్పడం లేదు కదా.. ఇది ప్రజల గుర్తుంచుకోవాలి. అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు. యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ గొండు కృష్ణ, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ రావు, ఎంపీపీలు గొండు రఘు రాం, అంబటి నిర్మల శ్రీనివాస్, జెడ్పీటీసీ రుప్పా దివ్య, మార్పు సుజాత, మ మండల అధ్యక్షులు చిట్టి జనార్ధన రావు, పీసా గోపి, ఏఎంసీ చైర్మన్ ముకళ్ల తాత బాబు, వైయస్ఆర్‌సీపీ నాయకులు గంగు నరేంద్ర, మార్పు పృథ్వి, ముంజేటి కృష్ణ, శుగ్గు మధు రెడ్డి, పీసా శ్రీ హరి, బూడ్డ లలిత, అరవల రామ కృష్ణ, యాళ్ళ నారాయణ, కొయ్యనా నాగబుషణం, సిమ్మ ధర్మ రాజు, రప్పా అప్పల సురి తదితరులు పాల్గొన్నారు