హామీలు అన్నీ అమ‌లు చేసిన ఘ‌న‌త మాదే 

 రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్రసాద‌రావు
 

శ్రీ‌కాకుళం:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపాద‌యాత్ర‌లో భాగంగా ప్ర‌జ‌లకు  ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేశార‌ని రెవెన్యూ శాఖామాత్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అన్నారు. కొమరవాని పేట గ్రామంలో గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ..గ‌డిచిన నాలుగేళ్ల‌లో అందించిన ప‌రిపాల‌న‌కు సంబంధించి పౌర స్పంద‌న తెలుసుకునేందుకు వ‌చ్చాం. పాల‌న‌లో సంస్క‌ర‌ణ‌లు, పాల‌న‌కు సంబంధించి మెరుగ‌యిన మార్పులు జ‌న జీవ‌న స్రవంతిని తెలుసుకునేందుకు వ‌చ్చాం. వైయ‌స్‌ జగన్ పాదయాత్ర లో వచ్చినప్పుడు ఆ రోజు చెప్పినవన్నీ, వాటితో పాటే ప‌రిశీల‌న‌లో ఉన్న మ‌రికొన్నింటినీ జ‌త చేసి తూచ తప్పకుండా అమలు చేశాం. దేశంలో ఇంకే రాష్ట్రాలు ఏపీ మాదిరి ఇవాళ సంక్షేమ ప‌థ‌కాల‌ను అమలు చేయలేదు. రాజ్యాంగంలో పొందుప‌రిచిన విధంగా ఆదేశ సూత్రాలు పాటిస్తూ పౌరులంద‌రికీ సంక్షేమ ఫ‌లాలు ప‌క్ష‌పాత ధోర‌ణికి తావివ్వ‌కుండా అందిస్తున్న ఘనత మనది.

ఏనాడైనా పేద వారి కోసం ఏకరా భూమి చంద్రబాబు కొన్నారా.. అని ప్రశ్నిస్తున్నా..? పేదలకు పెద్దగా ఏమి ఆశ‌లు ఉండవు. సొంత ఇల్లు ఉండాలి అని కోరిక తప్ప. అలాంటి 31 లక్షల మందికి ఆ కల నెరవేర్చాము. నియోజకవర్గంలో 20 వేల మందికి సొంతింటి క‌ల నెరవేర్చాము అన్న ఆనందం నాలో ఉంది. వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ హయాంలో ప్ర‌భుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు అందరూ సమానం. అదే మా ప్రభుత్వం సిద్ధాంతం. గత ప్రభుత్వం హయాంలో ఈ విధంగా జ‌రిగింది లేదు. పథకం వర్తించాలి అంటే జన్మభూమి కమిటీ సభ్యులకు దండం పెట్టీ,మోక‌రిల్లాల్సిందే. ఇంకా వారికి వాటా ఇవ్వాల్సిందే. పౌరుల ఆత్మ గౌరవం దెబ్బ తినేలా ఉండేవి వారి చర్యలు. 

ఈ రోజు పరిపాలన గ్రామానికి తీసుకు వచ్చాం. వైద్య వ్యవస్థలో కూడా అనేక మార్పులు తెచ్చాం..మూడు అంచెల విధానాన్ని తీసుకు వచ్చాం. గ్రామంలో వెల్ నెస్ సెంట‌ర్, మండలంలో పీహెచ్సీ,రిమ్స్ లో ఆధునిక వ‌స‌తుల‌తో కూడిన పెద్దాస్ప‌త్రిని తీసుకు వచ్చాం. క‌రోనా వేళ‌ల్లో ఇత‌ర రాష్ట్రాల క‌న్నా భిన్నంగా తొమ్మిది నెల‌ల పాటు మీ ఇంటికే స‌ర‌కులు ఇచ్చాం. 2004కి ముందు నాటికీ,ఇప్పటికీ నా హయాంలో కొమ‌రవాని పేట గ్రామంలో అనేక పనులు చేపట్టాం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 9.2 కోట్ల రూపాయ‌లు అభివృద్ధి కోసం వెచ్చించాం ఈ గ్రామానికి. గ్రామంలో మిగిలిన పనుల‌ను త్వరలో పూర్తి చేస్తాం. స్మశాన వాటిక కోసం త‌హ‌శీల్దార్ కి స్థలం సేకరించాలని ఆదేశించాను. త్వ‌ర‌లోనే ఈ స‌మ‌స్య కూడా ప‌రిష్కారం అవుతుంది.
అందరికీ ఇల్లు ఉండాలి అని,ఊరికి అని వైపులా రోడ్లు నిర్మించాం. సునామీ సమయంలో దెబ్బ‌తిన్న‌వారంద‌రికీ ఇళ్లు ఇచ్చాం. చంద్రబాబు మత్స్యకారులను అవమానించారు.శాంతియుతంగా చేస్తున్న ధర్నా కోసం వేసిన టెంట్లు తగల పెట్టించిన ఘనత చంద్రబాబుది. మహిళా సంఘాలకు ఉన్న అప్పులు అన్ని తీరుస్తా అని చెప్పి మోసం చేసిన చ‌రిత్ర ఆయ‌న‌ది. జగన్ సీఎం అయ్యాక ఇప్పటికే మూడు సార్లు బ్యాంకులకు మీ రుణం కట్టారు. మ‌రో విడ‌త‌లో మీ అప్పు క‌ట్టి మొత్తం బాకీ లేకుండా మీకు ఏ విధంగా బ్యాంక‌ర్ల నుంచి ఒత్తిడి లేకుండా చేస్తారు. 14 సంవ‌త్స‌రాల పాటు అధికారం అందుకునే అవకాశం చంద్రబాబుకు ఇస్తే ఆయ‌న ఏమీ చేయ‌లేదు. కానీ ఇప్పుడు మళ్లీ ఒక్క అవకాశం ఇవ్వాల‌ని అంటున్నారు. వేడుకుంటున్నారు చంద్రబాబు. ఆయన మాట ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థతి లేదు. మీకు మేలు చేసే ప్ర‌భుత్వానికి అండ‌గా ఉండండి. మద్ద‌తు ఇవ్వండి. పాల‌న‌లో వ‌స్తున్న లేదా వ‌చ్చిన ప్ర‌తి మార్పూ ఇవాళ జ‌న జీవితాల‌ను మారుస్తున్నాయి. జీవ‌న ప్ర‌మాణాల‌ను పెంచుతున్నాయి అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు.

యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు, ఎంపిపి గొండు రఘురాం, ఏమర్వో, ఎంపిడివో, నాటక అకాడమీ డైరెక్టర్ ముంజేటి కృష్ణ, సర్పంచ్లు రవి, పీస గోపి, మధు రెడ్డి, ఎంపిటిసి అంధవరపు బాల కృష్ణ, అరవల రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Back to Top