బ‌స్సు యాత్ర‌కు త‌ర‌లిరండి 

  రెవెన్యూ మంత్రి ధ‌ర్మాన పిలుపు 

  అవినీతి లేని పాల‌న అందిస్తున్నాం..  వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ దీవించండి 

 శ్రీ‌కాకుళం:  సామాజిక న్యాయభేరి పేరుతో వైయ‌స్ఆర్‌ సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 26 నుంచి 29 వరకు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మంత్రులతో నిర్వహిస్తున్న బస్సు యాత్రకు పెద్ద ఎత్తున త‌ర‌లి రావాల‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం మండ‌లం, తండేం వ‌ల‌స‌లో గ‌డ‌ప‌గడ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వంలో భాగంగా ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో మాట్లాడారు. తొలుత బెండివానిపేట‌లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. త‌రువాత బెండివాని పేట‌లో కార్య‌క‌ర్త‌ల‌తో  ఇంట్రాక్ట్ అయ్యారు. ప‌థ‌కాల అమ‌లు జ‌రుగుతున్న తీరు అడిగి తెలుసుకున్నారు. బెండివానిపేట‌లో చెరువు అభివృద్ధికి చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని అన్నారు. అదేవిధంగా రోడ్ల నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని, భూములు ఎవ్వ‌రూ అమ్మవ‌ద్ద‌ని, రానున్న కాలంలో ఇక్క‌డ మ‌రింత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామ‌ని పేర్కొన్నారు. అప్పుడు భూముల విలువ మ‌రింత పెరుగుతుంద‌ని అన్నారు. అదేవిధంగా ఆ రోజు బాబు చేసిన త‌ప్పిదాల‌నూ ప్ర‌స్తావించారు. స‌మ స‌మాజ స్థాప‌నే ధ్యేయంగా ప‌నిచేస్తామన్నారు. గ్రామాల్లో తిరుగుతూ, క్షేత్ర స్థాయిలో ప‌థ‌కాల అమ‌లు తీరు తెన్నులు తెలుసుకుంటూ కార్య‌క‌ర్త‌లు విప‌క్షాల విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని పిలుపునిచ్చారు.   సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుకు సంబంధించి అర్హుల‌యిన వారిని గుర్తించే బాధ్య‌త వ‌లంటీర్ల‌దేన‌ని తెలిపారు.  ప‌థ‌కాల అమ‌లు అన్న‌ది ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటోంద‌ని అన్నారు. ఎవ్వ‌రికీ ఏ లోటూ లేకుండా అవినీతికి తావే లేకుండా నేరుగా ల‌బ్ధిదారుల అకౌంట్ల‌లోకే న‌గ‌దు జ‌మ చేసి, సంబంధిత ఆర్థిక ల‌బ్ధి ద‌క్కేందుకు కృషి చేస్తున్నామ‌ని అన్నారు.
 ప్ర‌తి ఒక్క‌రికీ వారి అర్హ‌తను అనుస‌రించి ఒక్కో ప‌థ‌కం అందుతుంద‌ని, అంద‌రికీ అన్ని ప‌థ‌కాలూ వ‌ర్తించ‌వ‌ని, దీనిని అర్థం అయ్యే విధంగా వ‌లంటీరు చెప్పాలి అని, అదేవిధంగా వీధిలో ఉండే కార్య‌క‌ర్త కూడా వివ‌రించాల‌ని కోరారు. ఒక్కో కుటుంబానికి ల‌క్ష‌న్న‌ర నుంచి మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కూ ల‌బ్ధి చేకూరింద‌ని, అస‌లీ ఆర్థిక ప్ర‌యోజ‌నం అన్న‌ది వాళ్ల‌కు అంద‌కుంటే ఇవాళ పేద కుటుంబాలు ఇంత హాయిగా ఉండేవా? అందుకే మ‌ళ్లీ మ‌ళ్లీ ఈ ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రాధాన్యం ఇస్తూ, మీ మ‌ద్ద‌తు ఇవ్వండి అని కోరారు. క‌రోనా కాలంలోనూ ఇదే విధంగా పూర్తి బాధ్య‌త‌తో, ప్ర‌జ‌ల‌కు ఆక‌లి ద‌ప్పిక‌ల‌న్న‌వి లేకుండా చూసిన ప్ర‌భుత్వం ఇదేన‌న్న విష‌యాన్ని గుర్తించుకోవాల‌ని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు విన్న‌వించారు. 
 

తాజా వీడియోలు

Back to Top