లోతట్టు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి

వంశాధార వరదపై మంత్రి కృష్ణదాస్‌ సమీక్ష

శ్రీకాకుళం: లోతట్టు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆర్‌ అండ్‌ బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సూచించారు. బుధవారం వంశధార నది వరదపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గొట్టా బ్యారేజీ నుంచి 46,535 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మధ్యాహ్నం కల్లా లక్ష క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. దీంతో వంశధార నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ సూచించారు. లోతట్టు ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
 

Back to Top