కోడెల మృతిని రాజకీయం చేయడం బాబుకు తగదు

మంత్రి ధర్మాన కృష్ణదాస్‌
 

శ్రీకాకుళం: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు మృతి బాధాకరమని మంత్రి ధర్మాన కృష్ణదాస్‌ పేర్కొన్నారు. కోడెల మృతిని చంద్రబాబు రాజకీయం చేయడం తగదని సూచించారు. కుటుంబంలో నెలకొన్న బేధాభిప్రాయాల వల్లే కోడెల బలవన్మరణం పొందారని స్వయంగా ఆయన మేనల్లుడే ఫిర్యాదు చేశారని తెలిపారు.తమ పార్టీ నేతల మృతిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. కోడెల మృతిపై సిట్‌ దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిందని,కొద్ది రోజుల్లోనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని మంత్రి పేర్కొన్నారు.

Back to Top