కాపు యువత..పవన్‌ను నమ్మొద్దు

మంత్రి దాడిశెట్టి రాజా
 

కాకినాడ: కాపు యువత జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను నమ్మొద్దని మంత్రి దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. మీరంతా పవన్‌ను నాయకుడిని చేయాలని చూస్తే..ఆయన చంద్రబాబును నాయకుడిని చేయాలని కుయుక్తులు పన్నుతున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని, కాపులపై కేసులు ఎత్తేసి, కాపు సంక్షేమానికి పెద్దపీట వేసిన సీఎం వైయస్‌ జగన్‌కు అండగా నిలుద్దామని, మళ్లీ సీఎంను చేసుకుందామని పేర్కొన్నారు. గొల్లప్రోలులో ఏర్పాటు చేసిన కాపు నేస్తం మూడో విడత కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.  గత ప్రభుత్వాలు ఎన్నో రకాల మాటలు చెప్పి కాపులను ఉద్దరిస్తామని చెప్పారు. చేతల్లో శూన్యం. వైయస్‌ జగన్‌ ఈ రోజు కాపు కార్పొరేషన్‌కు రూ.10 కోట్లు ఇస్తామన్న దానికి మిన్నగా ఈ మూడేళ్లలో 32,800 కోట్లు కాపుల కోసం వైయస్‌ జగన్‌ ఇచ్చారు. గతంలో చూస్తే చంద్రబాబు పాలనలో తుని దుర్ఘటన, రైలు కేసులు కాపులను వేధించారు. అధికారమదంతో,రక్షసత్వంతో చంద్రబాబు కాపులపై దుర్మార్గంగా వ్యవహరించారు. వైయస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే కాపులపై పెట్టిన కేసులన్నీ తీసేశారు. ఈ రోజు కాపు యువత అందరూ కూడా పవన్‌ కల్యాణ్‌ను నమ్మి వెంట తిరిగారు. కానీ పవన్‌ కళ్యాణ్‌ చంద్రబాబును నాయకుడిని చేయాలని కుయుక్తులు పన్నుతున్నారు. గత ఎన్నికల మాదిరిగానే ఎన్ని కుయుక్తులు పన్నినా, ఎన్ని అడ్డుదారులు తొక్కినా వైయస్‌ జగన్‌ను ఎలా నిలబెట్టుకున్నామో..అలాగే తగ్గేదే లేదని ప్రతి గడప కూడా వైయస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకునేందుకు సిద్ధంగా ఉండాలని దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top