‘అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్‌’

మంత్రి దాడిశెట్టి రాజా

 విజయవాడ: కోనసీమ ఘటనపై లోతుగా విచారణ జరిపిస్తామని.. నిందితులెవరైనా వదిలేది లేదని రాష్ట్ర రోడ్లు, భవనాలు శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కుట్రలు పన్నడం చంద్రబాబుకు అలవాటేనని.. పక్కా ప్లాన్‌ ప్రకారమే విధ్వంసం సృష్టించారన్నారు. పచ్చని కోనసీమలో చంద్రబాబు, పవన్‌ అలజడి సృష్టించారని దుయ్యబట్టారు.
 
అంబేడ్కర్‌ పేరు పెట్టాలని చంద్రబాబు డిమాండ్‌ చేయలేదా?. అంబేడ్కర్‌ పేరు పెట్టాలని జనసేన దీక్షలు చేయలేదా? అని మంత్రి ప్రశ్నించారు. ‘‘ఆనాడు తుని ఘటనకు చంద్రబాబే కారణం. ఇప్పుడు ఈ ఘటనకు కూడా ఆయనే కారణం. ప్రజలన్నా.. వ్యవస్థలన్నా.. చంద్రబాబుకు భయం లేదు. ప్రజాస్వామ్యంపై గౌరవం లేని చంద్రబాబే గొడవలు సృష్టించారన్నారు. నిరసన కారులు జై జనసేన అంటూ నినాదాలు చేశారు. అమలాపురం విధ్వంసం వెనుక చంద్రబాబు, పవన్‌ హస్తం ఉందని’’ మంత్రి దాడిశెట్టి మండిపడ్డారు.
 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top