కులగణన ప్రక్రియ డిసెంబర్ 9 వతేదీన ప్రారంభం

మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

కులగణన తెలిశాక టీడీపీ వారికి కూసాలు కదిలాయి

సామాజిక సాధికారతకు సీఎం వైయ‌స్‌ జగన్‌ చిరునామా

 తాడేపల్లి: డిసెంబర్‌ పది నుంచి కుల గణన చేస్తామ‌ని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.  బీసీల తోలు తీస్తాం, తోకలు కట్ చేస్తానని చంద్రబాబు అన్నారు. కానీ, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బీసీలను అక్కున చేర్చుకున్నారని కామెంట్స్‌ చేశారు. సామాజిక సాధికారతకు సీఎం వైయ‌స్ జగన్‌ చిరునామా అని వ్యాఖ్యలు చేశారు. 

తాడేపల్లిలోని వైయస్సార్ సిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ సమగ్ర కులగణన చేయడమే వైయస్సార్ సిపి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.సమగ్ర కులగణన పేదవాడి జీవితానికి భద్రత కల్పిస్తుందని తెలిపారు. ప్రజల  జీవన స్థితి  మారడానికి  కులగణన  అవసరం అంటూ స్వాతంత్య్రం వచ్చిన  తర్వాత జనగణన తప్ప  కులగణన జరగలేదని వివరించారు. ముఖ్యంగా చెప్పాలంటే సామాజిక  సాధికారితకు  చిరునామా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. కులగణన  కోసం రాష్ర్టంలోని  కుల  సంఘాల  నాయకుల  అభిప్రాయాలు సేకరిస్తున్నామని ఇందుకోసం ప్రాంతీయ సమావేశాలు నిర్వహించి ఆయా వర్గాల అభిప్రాయాలు సేకరిస్తున్నామని తెలియచేశారు. మన రాష్ర్టంలో జరిగే కులగణన  దేశ  చరిత్రలో  సువర్ణాక్షరాలతో  లిఖించబడుతుందన్నారు.
సమగ్ర కులగణన  సామాజిక  కోణంలోనే  జరుగుతుందని అన్నారు. ప్రతిపక్షాలకు  కులగణన  అంటే  వెన్నులో  వణుకు పుడుతోందని తెలిపారు.

      కులగణనతో చంద్రబాబులాంటి ప్రతిపక్షనేతలకు కుబుసాలు కదిలాయన్నారు. చంద్రబాబు హయాంలో బిసిలను కేవలం ఓట్లకు పనికివచ్చే యంత్రాలుగా చూశారన్నారు. చంద్రబాబు ఏ వర్గాలనైతే వివక్షతో చూశారో,న్యూనతతో చూశారో ఆ వర్గాల విద్యాహీనతో,ఆర్దికమైన బలహీనత కారణంగా ప్రత్యేకించి బిసిలను అణగదొక్కేవిధంగా చంద్రబాబు అప్పట్లో సిఎం స్దానంలో ఉండి అవమానించారన్నారు.మత్స్యకారులను తోలుతీస్తానని,నాయీబ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తాననే మాటలు విన్నతర్వాత చాలాబాధకలిగిందన్నారు.చంద్రబాబు వివక్షతో చూసిన కులాలు వర్గాలను శ్రీ వైయస్ జగన్ అక్కున చేర్చుకున్నారన్నారు.వారిలో న్యూనతా భావాన్ని తొలగించారన్నారు.వారిదే వైయస్సార్ సిపి ప్రభుత్వం అనే విధంగా సగర్వంగా తలెత్తుకుని చెప్పుకునే విధంగా జగన్ గారు అండగా నిలిచారన్నారు.

       తెలుగుదేశం నేతలు విమర్శలు చేస్తున్నారు..... వాలంటీర్ల వ్యవస్ధ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే సాంటిటి ఉండదని అంటున్నారు.కాని కులగణన గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి ఎక్కడిది అని ప్రశ్నిస్తున్నాను.బిసి కులాలను వివక్షతో అవమానిస్తుంటే ఆ పార్టీలో ఉన్న బిసి నేతలు చంద్రబాబును కనీసం ప్రశ్నించలేకపోయారన్నారు.తోలుతీస్తానని,తోకలు కత్తిరిస్తానని అంటే మీకు సరదాగా అనిపించిందా అప్పట్లో ఎందుకు చంద్రబాబుకు బుద్ది చెప్పలేకపోయారు అని అన్నారు.కులగణన ప్రక్రియలో కులసంఘాల నేతలు,మేధావులు అందరూ జగన్ గారు తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం ఎవరి సలహాలు తీసుకోలేదని విమర్శిస్తోందని అది పూర్తిగా అవాస్తవం ఐదు రీజనల్ సమావేశాలు నిర్వహించామని స్పష్టం చేశారు.జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సమావేశాలు పెట్టి కులసంఘాల నేతల సమావేశాలు పెట్టి వారి సూచనలు తీసుకోవడం జరిగిందన్నారు.వారి అభిప్రాయాలను క్రోడీకరించాం. ఇంకా వాటిలో రెక్టిఫై చేయాలంటే ఆలోచన చేశాం. వీటిని టిడిపి నేతలు గమనించడం లేదు.అవసరమైతే మండలస్దాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని వివరించారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాల్సింది పోయి విమర్శించడం దురదృష్టకరమన్నారు. చంద్రబాబు,పవన్ కల్యాణ్,లోకేష్ లు పచ్చమీడియా ఈనాడు,ఏబిఎన్,టివి-5తో కలసి అబధ్దాలు ప్రచారం చేస్తున్నారన్నారు.ప్రజల అకాంక్షలను అధ్యయనం చేసి అర్దం చేసుకున్న ప్రభుత్వం అని కులగణన చేయాలని జగన్ గారు తీసుకున్న నిర్ణయం ప్రజారంజకమైందని అన్నారు.

Back to Top