తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బీసీలకు స్వర్ణయుగం అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అడగకుండానే, చట్టం చేసినట్టుగా బీసీలకు అన్నింటా 50 శాతం వాటా ఇస్తున్న జగనన్నకు బీసీ వర్గాలంతా జేజేలు పలుకుతున్నాయని తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు.
సీఎం వైయస్ జగన్ 26 నెలల పరిపాలనలో వెనుకబడిన వర్గాల ముద్రను తొలగించి సమాజంలో బీసీలను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దారని అన్నారు. రెండేళ్ళ రెండు నెలల కాలంలోనే బీసీవర్గాలకు డీబీటీ, నాన్ డీబీటీ పథకాల ద్వారా ఏకంగా రూ. 69,841.67 కోట్లు లబ్ధి చేకూర్చిన ఈ ప్రభుత్వంపై టీడీపీకి వత్తాసుపలికే ఓ వర్గం మీడియా బురదజల్లడంపై మంత్రి వేణు మండిపడ్డారు. బీసీలకు ఇంత చేస్తున్న ఈ ప్రభుత్వం గురించి ఒక్క మంచి మాట రాయకపోగా.. చంద్రబాబు హయాంలో రూ. 1600 కోట్లు రుణాలు ఇచ్చారని ఈనాడు రామోజీరావు పతాక శీర్షికలు పెట్టి వార్తలు రాయడం అంటే.. అంతకంటే దుర్మార్గం మరొకటి ఉండదన్నారు.
భారతదేశ చరిత్రలో బీసీలకు స్వర్ణయుగ పాలన అంటే 26 మాసాల వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి పాలన అని ఢంకాపథంగా చెప్పగలను. ఎందుకు ఈ మాటలు అంటున్నామో అందరూ గమనించండి... వెనుకబడిన వర్గాలు అనే ముద్ర నుంచి... వెన్నెముక వర్గాలు అనే స్థితికి చేరుకున్నది ఈ రెండేళ్ళ కాలంలోనే.
గత 26 నెలల కాలంలో... బీసీలకు డీబీటీ–నాన్ డీబీటీ ద్వారా చేకూరిన లబ్ధిః
మొత్తంగా బీసీలకు కలిగిన ప్రయోజనాలు రూ. 4కోట్ల 45లక్షల 63వేల 426. ఇవి మొత్తంగా ప్రభుత్వం ఇచ్చిన పథకాల ప్రయోజనాల్లో 50.11 శాతం.
బీసీలకు మొత్తంగా కలిగిన లబ్ధి.. అంటే మొత్తంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా కలిగిన లబ్ధిః రూ. 69,841.76 కోట్లు. ఇది మొత్తంగా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ అందించిన లబ్ధిలో 49.66శాతం.
నేరుగా బ్యాంకు అకౌంట్లలో జమ (డీబీటీ) ద్వారా, 24 పథకాల ద్వారా బీసీలకు కలిగిన ప్రయోజనాలు.. 3కోట్ల 24 లక్షల 10 వేల 506. మొత్తం సంక్షేమ కార్యక్రమాల ద్వారా కలిగిన ప్రయోజనాల్లో బీసీలకు అందినవి 49.62 శాతం.
ఈ విధానం ద్వారా బీసీలకు అందిన మొత్తం లబ్ధిః రూ. 50, 495 కోట్లు ( ఇది మొత్తం సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం పెట్టిన ఖర్చులో 48.35 శాతం.
నాన్ డీబీటీ 7 పథకాల ద్వారా, అంటే నేరుగా డబ్బు బదిలీ కాకుండా... ప్రయోజనాల బదిలీ ద్వారా బీసీలకు కలిగిన ప్రయోజనాలు రూ.1 కోటీ 21 లక్షల 52 వేల 921. ఈ ప్రయోజనాలు మొత్తం నాన్ డీబీటీ ప్రయోజనాల్లో 51.46 శాతం.
నాన్ డీబీటీ పథకాల ద్వారా బీసీలకు మొత్తంగా కలిగిన లబ్ధిః రూ. 19,346.39 కోట్లు.
మొత్తం డీబీటీ ద్వారా కలిగిన లబ్ధిలో బీసీల వాటా 53.45 శాతం.
నిజాలు ఇలా ఉంటే... ‘బీసీలకు రుణాలెక్కడ...’ అంటూ రాయితీ రుణాలను మా ప్రభుత్వం నిలిపివేసిందని ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికలో వార్తను ప్రచురించారు.
మొత్తంగా "చంద్రబాబు అయిదేళ్ళ పాలనలో బీసీ కార్పొరేషన్ల ద్వారా రూ.1626 కోట్ల రుణం ఇచ్చారట. ఇది చాలా గొప్ప విషయం అట!" బీసీలకు రుణాలు ఇవ్వటం చాలా గొప్ప విషయం అని... బీసీలకు ఎలాంటి రుణం, వడ్డీ లేకుండా... నేరుగా గ్రాంట్‌గా, అంటే తిరిగి కట్టాల్సిన అవసరం లేని డబ్బుగా ఇవ్వటం తప్పు అన్నట్టుగా ‘ఈనాడు’ రాసింది. ఒకసారి ఇలాంటి రాతలు రాయడానికి సభ్య సమాజం ఎలా ఆలోచిస్తుందనే విధానాన్ని కూడా ఈనాడు పత్రిక ఆలోచిస్తే బాగుండేది.
చంద్రబాబు హయాంలో ఇచ్చినది రుణం. అంటే బీసీలు రుణగ్రస్తులను చేయాలనే ఆయన తపనను చూసినందుకే ఈ రాష్ట్రంలో మొహం చూపించలేని విధంగా తండ్రీకొడుకుల్ని ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబుగారు చివరి ఏడాది మరో రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్లో పెట్టారట! అది ఎవరికీ ఇవ్వలేదని కూడా చెపుతూనే.... ఇవ్వనిది కూడా కలిపితే బీసీలకు ఇచ్చిన(?) రుణాలు రూ.2,500 కోట్లు అవుతాయట! ఇలాంటి రాతలు రాయడానికి వారికి సిగ్గుగా అనిపించలేదేమో! దీనికి బ్యాంకులు డబుల్ రుణాలు ఇస్తాయట!
బాబు పాలనలో బీసీలకు ఇచ్చాం అంటున్న రూ. 1600 కోట్లు కేవలం రుణం. అదీ అందరికీ కాదు... 1000లో ఒక్కరికికూడా రుణం అందలేదు. అది కూడా తమ పార్టీ వారికి మాత్రమే! లేకుంటే పార్టీ జెండా ఎత్తుకునేవారికి మాత్రమే. ముఖ్యమంత్రి జగన్‌గారి పాలనలో అందజేస్తున్న సంక్షేమం కేవలం వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలకు కాదు. కష్టంలో ఉన్న బీసీల జీవితాలను మార్చాలని, వారు స్వశక్తితో ఎదిగేందుకు చేసిన ప్రయత్నం. ఇది అందరికీ అందించిన సొమ్ము. ఇది రాష్ట్ర ప్రజలంతా గమనించాల్సిన విషయం.
చంద్రబాబు పాలనలో రుణం కావాలంటే అందులో పావలా వాటా లంచం ఇవ్వాలి. బీసీల రుణాలకు లంచం. బీసీల పనిముట్ల కొనుగోలులో లంచం. బీసీల ఎంపికలోనూ లంచం... అన్నింటా లంచం రాజ్యం ఏలింది. లంచరాజ్యంగా ఆనాడు పరిపాలన సాగింది. టీడీపీ హయాంలో పెన్షన్ ఇవ్వాలంటే జన్మభూమి కమిటీలకు రెండు,మూడు మాసాలు పెన్షన్ వారికి ఇవ్వాల్సిందే అనే వార్తలను మీ పత్రికలే రాసిన విషయాన్ని గమనించాల్సి ఉంది. ఇప్పుడు అలా కాదు... ముఖ్యమంత్రిగారు పాదర్శకతకు పెద్దపీట వేసి, అవినీతి రహిత పాలన అందిస్తూ పేదవాడికి అందాల్సిన ప్రభుత్వ లబ్ధి నేరుగా పేదవాడి ఖాతాల్లోకే చేర్చే విధానం ఇవాళ జరుగుతోంది. పెన్షన్ మొదలు ఇళ్ళ పట్టాలవరకు... కార్పొరేషన్ల మొదలు మంత్రి పదవుల వరకు అన్నింటా బీసీల వాటా బీసీలకు అడగకుండానే, ఒక చట్టం చేసినట్టుగా యాభై శాతం ఇచ్చిన విధానాన్ని ప్రపంచం అంతా చూస్తోంది. కానీ ఎల్లో పత్రికలవాళ్లకు కనిపించడం లేదు.
మా 26 నెలల పాలనలోనే బీసీలకు రూ. 69 వేల కోట్లకు పైగా ప్రయోజనాలిచ్చాం. కొన్ని పథకాలకు ఎంతెంత ఇచ్చామో చెపుతాను....
అమ్మ ఒడి ద్వారా రూ.5,900 కోట్లు
జగనన్న వసతి దీవెన ద్వారా రూ. 1060.01 కోట్లు
జగనన్న విద్యా దీవెన ద్వారా రూ.2,723.11 కోట్లు బీసీ పిల్లల కోసం తల్లులకు ప్రయోజనం
రైతు భరోసా ద్వారా రూ.7,970.99 కోట్లు
మత్స్యకార భరోసా ద్వారా రూ.328.51 కోట్లు
వైయస్సార్ పెన్షన్ కానుక ద్వారా రూ.17,301.80 కోట్లు
వైయస్సార్ ఆసరా ద్వారా రూ.3,012.24 కోట్లు
చేయూత పథకంతో రూ.5429 కోట్లు ప్రయోజనం
నేతన్న నేస్తం ద్వారా రూ.522.59 కోట్లు
ఇవి కొన్ని మాత్రమే వెల్లడించాను. స్పష్టంగా కనబడుతున్న విషయాన్ని వక్రీకరించి రాతలు రాస్తారా? వైయస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు చెప్పింది చేస్తారు అనే నమ్మకంతో బీసీలు జీవిస్తున్నారు. మా జీవితాలు మారతాయనే భావనతో ముద్ర వేసుకుంటున్న సమయంలో వారి మనసులను ఈ విషపు రాతల ద్వారా మలినం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
బాబు పాలన అంటే.. తన కులానికే మాత్రమే ఇచ్చుకునే ఆయనను చంద్రబాబు అనేవారు. చాలామందిలో ఆ భావన ఉండేది. కానీ చంద్రబాబు పాలనకు భిన్నంగా అన్ని కులాలకూ ఇచ్చే అన్నను జగనన్న అంటాం. నిన్న, మొన్న తన కులానికి కూడా బాబు ఏం చేయాలేదని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు బుచ్చయ్య చౌదరి అన్నారు. మరి ఎవరికి చేశాడో తెలియని ఈ బాబును రామోజీరావుగారు ఎందుకు నెత్తిన మోస్తున్నారో... ఎందుకు టీవీ5, ఏబీఎన్‌లు బాబు భజన చేస్తున్నాయో ప్రజలందరికీ తెలుసు.
గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీలకు చేసిన మేలు ఏమీ లేదు కాబట్టి, ఆ ప్రభుత్వాన్ని బాబుగారి క్లాస్ ప్రభుత్వంగా... బిజినెస్ క్లాస్ ప్రభుత్వంగా అందరూ భావించారు. మేం మాత్రం బీసీలను బ్యాక్‌బోన్ క్లాస్‌గా భావించాం. వెన్నెముక కులాలుగా భావించాం.
- బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు... బ్యాక్‌బోన్ క్లాస్ అని జగన్ మోహన్ రెడ్డిగారు చెప్పిన మాటను తూచ తప్పకుండా అమలు చేస్తున్నారు. పేదరికం అనే శాపం, రోగంతో బలహీనపడినవారిని బలంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో జగన్‌గారి పాలన సాగుతోంది. ఈ విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. బీసీలుగా పుట్టడం నాడు బలహీనత అనుకుంటే... బీసీలుగా పుట్టడం ఇవాళ బలానికి మార్గం అని ప్రజలు భావిస్తున్నారు.
139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు... ప్రతి కార్పొరేషన్‌కూ 12 మంది డైరెక్టర్లు ఉండేలా నియామకాలు చేశాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను తిరగరాసేలా బలహీన వర్గాలను బలపరచటంలో తనదైన మార్కు ఈ ప్రభుత్వం చూపించింది.
– 56 కార్పొరేషన్ల డైరెక్టర్లలో 29 మంది మహిళలకు; 672 మంది డైరెక్టర్లలో 339 మంది మహిళలకు స్థానం కల్పించటం ద్వారా మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టాం.
ఈ విషయాన్ని చాలా గర్వంగా చెప్పగలుగుతున్నా. బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలను పుణికిపుచ్చుకుని మహిళాభ్యున్నతికి పాటుపడుతున్న జగన్‌గారు చరిత్రలో నిలుస్తారనడానికి ఇది ఒక తార్కాణం. రాష్ట్రంలో ఉన్న మహిళలంతా "జగనన్న మా అన్న" అనేలా ఉన్నారు. చంద్రబాబును భుజాన వేసుకుని ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూ ప్రజలను మరింత క్షోభ పరుస్తున్నారో ..వారికి ఇది ఒక గుణపాఠం కావాలి.
– దేశ చరిత్రలో, దేశ సామాజిక చరిత్రలో, దేశ రాజకీయ చరిత్రలో వెనుకబడిన వర్గాలకు ఒక రాష్ట్రంలో ఇన్ని పదవులు ఇవ్వటం... అందులో సగం మహిళలకు దక్కటం మీరెక్కడైనా చూశారా? చంద్రబాబు పాలనలో ఏరోజు అయినా మహిళలకు గౌరవం ఇచ్చారా? తోకలు కత్తిరిస్తామన్నారు, కార్యాలయాలకు వస్తే వెటకారం చేసిన మీకు బీసీల గురించి మాట్లాడే అర్హత మీకెక్కడ ఉంది.
బీసీలకు చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా కార్పొరేషన్ పదవులు ఇచ్చారన్నది జీర్ణించుకోలేకపోతున్నవారంతా... ఇలాంటి దిగజారుడు రాజకీయాలకు దిగుతున్నారు. వీరికి గుణపాఠం మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ చెప్పారు. భవిష్యత్తులో జనరల్ ఎన్నికల్లోనూ చెపుతారు. ఇప్పటికైనా వాస్తవాలను ప్రజలుకు తెలియచేస్తే జర్నలిజాన్ని రక్షించినవారు అవుతారు.
చంద్రబాబుగారూ.. మీరు బీసీలను ఎప్పుడూ రుణగ్రస్తులగా ఉంచి, వారి ఓట్లను తాకట్టు పెట్టుకుని రాజ్యం ఏలాలి అనుకున్నారా? బీసీలు అంటే వెన్నెముక కులాలని, సమాజ నిర్మాణంలో భాగస్వామ్యులని, భారతీయ సంస్కృతి, సంరక్షకులని జగన్ మోహన్ రెడ్డి గారు మాట్లాడారే అది మీకు కనిపించలేదా? ఒక మనిషిని మనిషిగా చూడాలి, పాలన అంటే సేవ అనేలా చెప్పిన జగన్‌గారి మాటలు ఈ దేశ చరిత్రలో రాజకీయ నాయకులకు ఆదర్శం అయితే... మీరు మాత్రం మీ రాతల ద్వారా రాష్ట్ర ప్రజలను పట్టిపీడించి, నిత్యం అసత్యాలతో పాలన సాగించి ఎన్నికల సమయంలో ఏదో తాయిలాలు ఇచ్చి, ఓట్లు వేసిన తర్వాత మర్చిపోయి, రాజకీయ వ్యవస్థ పట్ల నమ్మకం కోల్పోయేలా చేసిన మీ పాలనకు... పాలన అంటే నిజమని,
చెప్పారంటే చేయాలని, దానికోసం ఎంత కష్టాన్ని అయినా భరించాలనే జగన్ గారి పాలనకు పోలికా..?
నాడు ఎన్నికల ముందు మీరు రాసిన రాతలను ప్రజలు నమ్మలేదని... నేడు బలహీనవర్గాలు జగన్ గారి బంధువులు అయిపోతున్నారని, వారిని దూరం చేయాలని, భయభ్రాంతులకు గురిచేసి, వారిలో ప్రలోభాలకు గురిచేయాలనే దురాలోచనతో మీ రాతలు ఉన్నాయి.
- అయ్యా.. రామోజీరావుగారూ.. తమరు గత పాలనలో ప్రభుత్వం చేసిన తప్పులను సరైన రీతిలో చెప్పకుండా వారికి భజన చేయడం వల్లే.. అందుకు ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఫలితాలే నిదర్శం. అయినా మళ్లీ ప్రజలను మీ రాతల ద్వారా మభ్యపెట్టే ప్రయత్నాలను ఎవరూ నమ్మరు.
ప్రజలల్లో విశ్వసనీయత, విధేయతకు, ప్రజల పట్ల అంకిత భావంతో అవినీతి రహిత పాలన అందిస్తూ పేదవాడికి అందాల్సిన ప్రతి పైసా పేదవారికి ఇంటికి చేరుస్తూ, రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే థ్యేయంతో ముఖ్యమంత్రిగారు పనిచేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రధాన ఆయుధం విద్య అని నాడు పూలేగారు, అంబేడ్కర్ సూక్తులకు అనుగుణంగా ఈ రాష్ట్రంలో ‘నాడు-నేడు’, విద్యా కానుక, అమ్మ ఒడి అందిస్తున్నారు. ఇలాంటి గొప్ప మనసున్న ముఖ్యమంత్రి జగన్‌గారి మీద ఇలాంటి రాతలు రాయడం దురదృష్టకరం.
మీరు ఏ రాతలు రాసి, మాయ మాటలు చెప్పినా బీసీలంతా వైఎస్ జగన్ గారి పక్షానే ఉన్నారు. ఈనాడు బీసీ కులాల రక్షకుడుగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఉన్నారు. ఇళ్లులేనివారికి పట్టాలు ఇచ్చి, వారికి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. రాష్ట్రంలో భద్రతతో ఉన్నవారిని భయానికి గురి చేయవద్దని రామోజీరావుగారికి చెబుతున్నాం.
- ‘రైతు గుండెల్లో మీటర్లు’ అని... రైతులకు తెలియకుండానే మీటర్లు బిగించారని, ఎలాంటి సమాచారం ఇవ్వలేదని శ్రీకాకుళం జిల్లా జములూరు మండలానికి చెందిన కింజారపు సత్యన్నారాయణ అనే రైతు చెప్పినట్లు రాసుకొచ్చారు. ఈ సందర్భంగా కింజారపు సత్యన్నారాయణ వాస్తవంగా ఏం మాట్లాడారో వీడియోను మంత్రి మీడియాకు వినిపించారు.
- ఈనాడు పత్రికలో బీసీలకు రుణాలు ఎక్కడ అని, కార్పొరేషన్లు పెరిగినా ప్రయోజనాలు సున్నా అని రాశారు. చంద్రబాబు అయిదేళ్ల పాలనలో బీసీలకు రూ.1600 కోట్లు ఖర్చుపెడితే.. మా ప్రభుత్వ బీసీల పిల్లలు విద్యావంతులు అయి, వారు విదేశాలకు వెళ్లేలా ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటుంటే.. మీ పాలనలో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసి ప్రయివేట్ విద్యను ప్రోత్సహించారు. తల్లి కంటే గొప్పగా ఆలోచించిన ముఖ్యమంత్రి జగన్‌గారు బీసీల ఉద్దారకుడు.
-కనీసం మంచి రాయలేరు. మీ చెడు రాతల ద్వారా వారి మనసులను కలిచివేయవద్దని రామోజీరావుగారికి విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబును మోయండి తప్పలేదు. అంతేకానీ ఈ రాష్ట్రంలో మంచిని చెడుగా చూపించాలనే ప్రయత్నాన్ని ప్రజలు సహించరు. ప్రజల పక్షాన ప్రజల కోసం నిరంతరం తపించే ప్రభుత్వంపై బురదచల్లే కార్యక్రమం భావ్యం కాదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మనవి చేశారు.