అప్పులపై టీడీపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోంది

అమ‌రావ‌తి: అప్పులపై టీడీపీ గోబెల్స్‌ ప్రచారం చేస్తోంద‌ని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి మండిప‌డ్డారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో పోలిస్తే మేం చేసింది తక్కువే అన్నారు. గురువారం అసెంబ్లీలో మంత్రి బుగ్గన మాట్లాడుతూ..అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారు. మేం మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చామ‌న్నారు. హామీలు నెరవేర్చని చంద్రబాబును వామపక్షాలు ఎందుకు ప్రశ్నించలేద‌ని నిల‌దీశారు. నిరుద్యోగ భృతిపై చేతులెత్తేసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు?. 
మేం చేసిన అప్పులతో సంక్షేమ పథకాలు అందించామ‌న్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ఎక్కడికి పోయాయ‌ని ప్ర‌శ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులతో ప్రజలకు ఏ మంచిపనైనా జరిగిందా? అని మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి పేర్కొన్నారు.

Back to Top