పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం  

ఫ్యాప్సీ ఎక్సలెన్స్‌ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌
 

విశాఖ:పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఫ్యాప్సీ ఎక్సలెన్స్‌ అవార్డ్సు 202–2023 కార్యక్రమం శుక్రవారం విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుడివాడ అమర్నాథ్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. నైపుణ్యం గల యువతను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్‌ సహజ వనరుల నిలయమన్నారు. మే 3న అదానీ డేటా సెంటర్‌కు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేస్తారని తెలిపారు. రూ.5 వేల కోట్లతో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులకు మే 3న ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి భూమి పూజ చేసి నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభిస్తారు. ఒకేసారి 22 విమానాలు ఆగేలా..ఏటా 1.80 కోట్ల మంది ప్రయాణించేలా నిర్మాణం ఉంటుంది.  నిర్మాణ బాధ్యతలను పలు అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్మించిన రికార్డు ఉన్న జీఎంఆర్‌ గ్రూప్‌ చేపట్టిందని చెప్పారు. 
మొత్తం మూడు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో 60 లక్షల మంది ప్రయాణించేలా రూ.5,000 కోట్లతో పనులు చేపడతారు. ఇక రెండో దశలో 1.20 కోట్ల మంది, మూడో దశలో 1.80 కోట్ల మంది ప్రయాణించేలా అభివృద్ధి చేస్తారు. 2025 నాటికి తొలి విమానం.

Back to Top