కరోనా కష్టకాలంలో కూడా సుపరిపాలన  

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

కర్నూలు: కరోనా కష్టకాలంలో కూడా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సుపరిపాలన అందించార‌ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. చంద్రబాబు పాలనంతా అబద్ధాలమయం అని మండిప‌డ్డారు. కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ప్లీనరీలో  మంత్రి బుగ్గ‌న మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పులపాలు చేశారని దుయ్యబట్టారు. ఆర్థికంగా ఎన్ని కష్టాలు ఉన్నా ప్రతి హామీని ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారని.. కరోనా కష్టకాలంలో కూడా సుపరిపాలన అందించారన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ పాలనపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, టీడీపీ నేతలు బాదుడే బాదుడు అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులు మూడేళ్లలో 25 శాతం పెరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. ప్లీన‌రీ స‌మావేశంలో మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం, వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు బాల‌నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు ఎర్ర‌కోట చెన్న‌కేశ‌వ‌రెడ్డి, సాయిప్ర‌సాద్‌రెడ్డి, సుధాక‌ర్‌, మేయ‌ర్ బీవై రామ‌య్య‌, మాజీ ఎంపీ బుట్టా రేణుక త‌దిత‌రులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top