బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవం

పయ్యావుల ఆరోపణలు అర్ధరహితం

మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

తాడేప‌ల్లి: బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమ‌ని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఖండించారు. పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపణలు అర్ధరహితమని ఆయ‌న‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైయ‌స్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమనాలు రేకెత్తిస్తున్నారన్నారు. ఆడిట్‌ చేసినప్పుడు పలురకాల ప్రశ్నలు వేస్తారని.. ఆడిట్‌ సంస్థ ప్రశ్నలను ఆధారంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

సందేహాలు ఉంటే మీటింగ్‌ పెట్టి పరిష్కరించుకోవచ్చని.. లేఖలు రాయటం వల్ల ప్రయోజనం ఏంటో అర్థం కావట్లేదన్నారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించారన్నది అవాస్తవమని మంత్రి తెలిపారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలు ఉన్నాయని.. ప్రతిపక్షం నిజాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి బుగ్గన హితవు పలికారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top