సభా వ్యవహారాలపై సభ్యులు అవగాహన పెంచుకోవాలి

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

అమరావతిః అసెంబ్లీకి ఎన్నికైనా తర్వాత మనపై ఎంతో బాధ్యత ఉందని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర‌నాథ్ రెడ్డి అన్నారు.రెండు రోజులు పాటు జరగనున్న  ఏపీ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలకు శిక్షణ తరగతులు ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు.ఎలాంటి వృధా ఖర్చులు లేకుండా అసెంబ్లీ కమిటీ హాల్‌లో శిక్షణా తరగతులు చేపట్టామన్నారు.ఏ అంశంపైనైనా సభలో సభ్యులు అవగాహన పెంచుకోవాలన్నారు.అప్పుడే చట్టం రూపకల్పనలో సభ్యులకు పాత్ర ఉంటుందన్నారు.గత ప్రభుత్వం ఎమ్మెల్యేలకు శిక్షణ పేరుతో ఖరీదైన హోటల్‌లో పెట్టి ప్రజాధనం వృధా చేసిందన్నారు.
 

Back to Top