స‌మావేశాల‌ను అడ్డుకోవాల‌నే స‌భకు వ‌స్తున్నారు 

- అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి

స‌మావేశాలు స‌జావుగా జ‌ర‌గ‌కుండా చూడాల‌ని ముంద‌స్తుగా నిర్ణయించుకుని టీడీపీ వాళ్లు స‌భ‌లో అడుగుపెట్టారు. గ‌తంలో టీడీపీ హ‌యంలో కంటే అద్భుతంగా స‌భ‌ను నిర్వ‌హిస్తున్నాం. ప్ర‌తిప‌క్షం అడిగిన ప్ర‌తి ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌డానికి మేం సిద్ధంగా ఉన్నాం. విన‌డానికి మాత్రం వారు సిద్ధంగా లేరు. చిన్న‌పిల్ల‌ల మాదిరిగా ప్ర‌తిదీ వెంట‌నే ఇప్పుడే కావాల‌ని చిన్న పిల్ల‌ల మాదిరిగా ప‌ట్టుబ‌డితే తెచ్చివ‌డం ఎవ‌రి త‌ర‌మూ కాదు. వారు నిర్దేశించిన రూల్స్ వాళ్లే ఉల్లంఘించ‌డం శోఛ‌నీయం. 
- అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ప‌బ్లిక్ మీటింగ్ పెట్ట‌కూడ‌దు
-  ఐదుగురు అంత‌కంటే ఎక్కువ‌గా ఉండ‌కూడ‌దు
- ప్ల‌కార్డులు ప‌ట్టుకోవ‌డం, అర‌వ‌డం, గుమ్మిగూడి ధ‌ర్నాలు చేయ‌డం, క‌ర్ర‌లు ప‌ట్టుకోవ‌డం చేయ‌కూడ‌దు
- స‌భలో ఉన్న స‌భ్యుల‌కు, స‌మావేశాల‌కు ఆటంకం క‌లిగించ‌కూడ‌దు
పై  నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే అలాంటి వారిని స‌భ నుంచి పంపించి వేయ‌బ‌డును. స్పీక‌ర్ నియ‌మించిన చీఫ్ మార్ష‌ల్స్ వారిని బ‌య‌ట‌కు పంపించే అధికారం ఉంద‌ని టీడీపీ అధికారంలో ఉండగానే నిబంధ‌న‌లు రాశారు. 

 

Back to Top