మాలో అసహనం లేదు

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: ప్రభుత్వంలో అసహనం లేదని, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మూడు సార్లు సభ్యుల సందేహాలకు సమాధానం ఇచ్చారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. సభ సజావుగా జరగాలని మేం భావిస్తున్నామని పేర్కొన్నారు. తప్పుడు సమాచారాన్ని బయటకు పంపాలని టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. మాలో అసహనం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అంశంపై చర్చ జరుగుతుంటే ఒక పేపర్‌ క్లిప్పింగ్‌ను టీడీపీ తీసుకొని రాద్ధాంతం చేస్తుందని విమర్శించారు. టీడీపీకి ఇన్నిసార్లు అవకాశం ఇచ్చినా కూడా ప్రతిపక్ష నేత తీరు మారడం లేదన్నారు.

40 ఏళ్ల అనుభవం అంటున్న వ్యక్తి సభలో రాజకీయాలు చేయడం దురదృష్టకరమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అంశంపై చర్చ జరుగుతుంటే టీడీపీ అడ్డుకోవడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మూడు సార్లు టీవీలో చూపిస్తూ వివరణ ఇచ్చారని, అదే అంశాన్ని పట్టుకొని టీడీపీ రాద్దాంతం చేయడం భావ్యం కాదన్నారు. ఎన్నిసార్లు ప్రశ్న అడిగినా..వాట్‌ ఐయామ్‌ సేయింగ్‌ అన్నదే చంద్రబాబుకు గుర్తుకు వస్తుందని ఎద్దేవా చేశారు. డిఫరెంట్‌ ఫార్మెట్లలో ప్రతిపక్ష సభ్యులు మాట్లాడే అవకాశం ఉంటుందని, ఆ విధంగా ముందుకు రావాలని సూచించారు. 

 

తాజా ఫోటోలు

Back to Top