ఆస్తిపన్నుపై అపోహలకు గురికావొద్దు

అసెంబ్లీ మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

అసెంబ్లీ: ప్రస్తుతం ఉన్న ప్రాప‌ర్టీ ట్యాక్స్‌కు 10 నుంచి 15 శాతానికి మించి పెరిగే ప్రసక్తి లేదని,  ఆస్తిపన్ను విధింపుపై ప్రజలను ప్రతిపక్షం గందగోళంలోకి నెడుతుందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆస్తిపన్ను నివాస గృహాల‌ ఆస్తి విలువ మొత్తం మీద 0.10 నుంచి 0.50 శాతం మాత్రమే పెరుగుతుందన్నారు. మున్సిపల్‌ లా సెకండ్‌ అమెండ్‌మెంట్‌ బిల్లుపై సభలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అవినీతి లేకుండా, పారదర్శక విధానం ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నామన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధానం అమల్లో ఉందన్నారు. 375 చదరపు అడుగులలోపు ఉన్న ఇళ్లకు కేవలం రూ.50 మాత్రమే పన్ను ఉంటుందన్నారు. ప్రజలు అపోహలకు గురికావొద్దని సూచించారు. 

Back to Top