పోలవరం దుస్థితికి చంద్రబాబే కారణం

కాసుల కక్కుర్తికి ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టుపెట్టారు

మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వ‌జం

అమరావతి: కాసుల కక్కుర్తి కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టుపెట్టారని, పోలవరం ప్రాజెక్టును పాత లెక్కలకు ఒప్పుకుంది చంద్రబాబేనని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. చంద్రబాబు దోపిడీ వల్ల పోలవరం నిధులు తగ్గాయన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టులో కమీషన్ల కోసం చంద్రబాబు కాంట్రాక్ట్‌ తీసుకున్నారన్నారు. నేటి పోలవరం దుస్థితికి గత ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. కేంద్రాన్ని ఒప్పించి పోలవరం పూర్తిచేస్తామని, కోర్టుకు వెళ్లకుండా సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తున్నానన్నారు. పోలవరం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రధానితో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడతారని చెప్పారు. 

Back to Top