సామాన్యుడికి న్యాయం జరగాలంటే వైయ‌స్‌ జగన్ సిఎంగా ఉండాలి

 మంత్రి బొత్స సత్యనారాయణ 
 

శ్రీ‌కాకుళం: సామాన్యుడికి న్యాయం జరగాలంటే వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డి  ముఖ్య‌మంత్రిగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమ‌వారం శ్రీ‌కాకుళంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ప్ర‌తిప‌క్ష నేత‌ చంద్రబాబునాయుడు సహనం కోల్పోయి మాటాడుతున్నారు. నోటికి ఏదొస్తే అది మాటాడుతున్నారు. బాబు మాటలు నీచాతి నీచంగా ఉన్నాయి. అతనే నిజాయితీ , సచ్చీలుడుగా మాటాడుతున్నారు. చంద్రబాబు సభ్యసమాజం హర్షించని విధంగా మాటాడుతున్నారు. సానుభూతి కోసం మాటాడుతున్నారు‌. తాను యోగి , మహాపురుసుడు , ఇతరులు దుర్మార్గులు అన్నట్టు మాటాడుతున్నారు.

వైయ‌స్ఆర్‌ సిపి వెనుక జనం ఉన్నారని అసహనానికి లోనవుతున్నారు. ఇంత వయస్సు వచ్చి ఎందుకు సహనం కోల్పోతున్నారన్నారు. మాకు మాటలు వచ్చు , రాజ్యాంగాన్ని గౌరవించబట్టే మాట్లాడ‌టం లేదు. ప్రతి చిన్న అంశాన్ని చంద్రబాబు రాజకీయ లబ్దికోసం ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు లా అబద్దాలు, ఫ్యాబ్రికేట్ చేస్తూ పబ్లిసిటి చేస్తూ మాటాడాల్సిన‌ పనిలేదు. వచ్చే ఎన్నికలలో మనం చేసిన పనులు చెప్పుకుంటే చాలు. భూ రికార్డుల సమస్య‌ పాదయాత్రలో రైతులు వైయ‌స్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. అధికారం లోకి వచ్చాక భూ హక్కు కార్యక్రమం తీసుకువచ్చాం.

దేశం మెత్తం భూ హక్కు కార్యక్రమం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళుతుంది. గ్రామకంఠాలు , ఎండోమెంట్ , ఉమ్మడి కుటుంబాల భూ సమష్య లేకుండా చుసేందుకు ప్రయత్నిస్తున్నాం. నరసన్నపేట లో 23 వ తేధీన రెండొవిడిత శాస్విత భూ హక్కు , భూరక్ష కార్యక్రమం ప్రారంభిస్తారు. ప్రభుత్వం తో పాటు కార్యకర్తలు అంతా ముఖ్యమంత్రి సభను విజయవంతం చేయాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు.
 

తాజా వీడియోలు

Back to Top