టీడీపీ హయాంలో 2900 స్కూళ్లు మూసివేత

మంత్రి బొత్స సత్యనారాయణ
 

విశాఖ: టీడీపీ హయాంలో రాష్ట్రంలో 2900 ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. 2014–2019 మధ్య విద్యా రంగంలో ఏం చేశారో యనమల చెప్పగలరా అని ప్రశ్నించారు. మీ నియోజకవర్గంలో ఏ పాఠశాలలు మూసివేశామో చెప్పగలరా అని మంత్రి సవాలు విసిరారు. విద్య, వైద్యం, వ్యవసాయానికి మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ప్రైవేట్‌ స్కూళ్లకు ధీటుగా ఉండాలనే నాడు–నేడు కార్యక్రమం చేపట్టామని తెలిపారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 
 
మోస‌పూరిత భావాల‌తో త‌ప్పుడు క‌థ‌నాలు: పాఠశాల‌ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ 

  •  కొన్ని పత్రికలలో అసత్యాలు రాసి ప్రజలని మభ్యపెట్టాలని చూస్తున్నారు
  •   నిరుపేదలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు
  • విద్య ద్వారానే పేదరికం తగ్గుతుందని సిఎం వైఎస్ జగన్ భావిస్తూ అధిక ఖర్చు చేస్తున్నారు
  •  విద్యాప్రమాణాలపై ఎప్పటికపుడు కేంద్ర, రాష్ట్ర స్ధాయిలో పరిశీలన జరుగుతోంది
  •  21 న శతాబ్దంలో వచ్చిన మొదటి నూతన‌జాతీయ విద్యావిధానం నూతన‌జాతీయ విద్యావిధానం రాకమునుపే నిపుణుల క‌మిటీని ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది
  •  బాలకృష్ణన్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ కూడా విద్యావిధానంలో సంస్కరణలు సూచించింది
  •  2019 నాటికి 15 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 55 శాతం విద్యార్ధులు చదివితే....45 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 45 శాతమే చదువుతున్నారు
  •  ప్రైవేడ్ పాఠశాలల్లో ఎందుకు ఎక్కువ చదువుతున్నారు
  •  పేదవాళ్లు సైతం తమ‌ పిల్లలని బాగా చదవాలనే ప్రైవేట్ వైపు అడుగులు వేస్తున్నట్లు గుర్తించాం...
  •  ఇంగ్లీష్ మీడియం కోసం పది కిలోమీర్ల పైన ప్రైవేట్ స్కూళ్లకి కూడా వెళ్తున్నారు
  •  దీంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు వసతులు తక్కువగా ఉన్నాయని గుర్తించాం
  •  97 శాతం మంది తల్లితండ్రులు ఇంగ్లీష్ మీడియం కోరుకున్నారు...
  •  ఈనాడు రాసినవి చాలా తప్పుడు రాతలు
  •  సోషల్ ఆడిట్ చేసే వాళ్లు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్దిని చూసి ఆశ్చర్యపోతున్నారు
  •  ప్రభుత్వ పాఠశాలలని అభివృద్ది చేయడం మంచిదే కదా
  •  ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలని కోరుకుంటున్నారా...ఏంటి రాతలు...ఏంటి ఆ మేనేజ్ మెంట్ల ఉద్దేశం
  •  వార్తలు రాసిన వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు
  •  ఈ వార్తల వెనుక దురద్దేశమేంటి...ప్రభుత్వ స్కూళ్లలో అభివృద్ది జరగకూడదనా మీ‌ ఉద్దేశం
  •  10+2 విద్యావిధానంలో మార్పులు తీసుకువచ్చాం
  •  పూర్తిస్ధాయిలో కసరత్తులు చేసిన తర్వాతే పాఠశాలల మ్యాపింగ్ చేపట్టాం
  •  8643 ప్రైమరీ స్కూళ్లు 250 మీటర్ల లోపు ఉన్నాయి
  •  మొదటి దశలో కిలో మీటర్ లోపు ఉన్న ప్రైమరీ పాఠశాలలనే పరిగణనలోకి తీసుకున్నాం
  •  మ్యాపింగ్ తర్వాత 5919 స్కూళ్లకి తగ్గాయి...ఇందులో కూడా ప్రజాప్రతినిధులు 841 విజ్ణప్తులు ఇచ్చారు
  •  6882 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించి చర్యలు తీసుకున్నాం..
  •  సబ్జెక్ట్ ఉపాధ్యాయులతోనే మూడు, నాలుగు, అయిదు తరగతుల విద్యార్ధులకి‌ పాఠ్యాంశాల బోధన
  • 4067 మంది ఉపాధ్యాయులకి పదోన్నతులు ఇవ్వబోతున్నాం
  •  గుజరాత్ రాష్ట్రం కూడా మూడు, నాలుగు, అయిదు స్కూలక్లని హైస్కూలులోకి‌ మార్చబోతున్నారు
  •  వచ్చే ఏడాదికి ఈ పాఠశాలలకి 35 వేల అదనపు తరగతులని కూడా నిర్మించబోతున్నాం
  •  విద్యార్ధుల‌ భవిష్యత్ కోసమే ఈ సంస్కరణలు
Back to Top