అనేక పార్టీల్లో బీఆర్‌ఎస్‌ ఒకటి

ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధం

 విజయనగరం: ఏపీలో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్‌ఎస్‌ ఒకటని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. ‘టీఆర్‌ఎస్‌.. బీఆర్‌ఎస్‌ పార్టీగా మార్చుకోవడం వాళ్ల ఇష్టం..ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిదని,  బీఆర్‌ఎస్‌ ప్రభావం మాపై ఏం ఉండద‌ని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీతో చర్చకు సిద్ధమని మంత్రి స‌వాలు విసిరారు.  రైతుల ముసుగులో టీడీపీ,రియల్ ఎస్టేట్ దోపిడీదారులు అమరావతి పేరుతో పాదయాత్ర చేస్తున్నార‌ని మండిపడ్డారు.ఏం ఉద్దరించడానికి పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు. వారికి తాము ఎందుకు సహకరించాలని నిలదీశారు.అమరావతి భూముల్ని టీడీపీ నాయకులు దోచుకున్నారని విమర్శించారు. టీడీపీ నాయకులు ఎంత దోచుకున్నారో శాసనసభ సాక్షిగా వెల్లడించినట్లు తెలిపారు.    

తాజా వీడియోలు

Back to Top