కేటీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి బొత్స కౌంటర్‌

హైదరాబాద్‌లోనే కరెంట్‌ కోతలు ఉన్నాయి

స్వయంగా నేను అనుభవించి వచ్చాను

కేటీఆర్‌ వస్తే రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తా..

విజయవాడ: హైదరాబాద్‌లోనే కరెంట్‌ కోతలు ఉన్నాయని, స్వయంగా తాను అనుభవించానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్‌ ఇచ్చారు. కేటీఆర్‌కు ఎవరో ఫోన్‌లో చెప్పి ఉంటారేమో గానీ, హైదరాబాద్‌లో కరెంట్‌ కోతలు తాను స్వయంగా చూశానని, మొన్న హైదరాబాద్‌కు వెళ్లినప్పుడు ఇంట్లో జనరేటర్‌ పెట్టుకొని ఉండివచ్చానని చెప్పారు. దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. బాధ్యత గల వ్యక్తులు అలా మాట్లాడటం కరెక్ట్‌ కాదని, వారి ప్రభుత్వ ఘనతను చెప్పుకోవచ్చు కానీ, మరో రాష్ట్రంపై ఇలా మాట్లాడడం సరికాదన్నారు. 

కేటీఆర్‌ ఏపీకి వస్తే రోడ్లు ఎలా ఉన్నాయో చూపిస్తానని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఇప్పుడు కొత్తగా వేసిన రోడ్డుపైనే నిలబడి మీడియాతో మాట్లాడుతున్నానని చెప్పారు. కేటీఆర్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సూచించారు. 
 

తాజా వీడియోలు

Back to Top